లక్ష్మణచాంద, వెలుగు: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సోన్ మండల కేంద్రంలో, లక్ష్మణచాంద మండలం పార్‌పల్లి గ్రామంలో జరుగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.సర్ ఫారమ్‌లు నింపే సమయంలో అధికారుల సహకారం అందించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్లు సంతోష్, సరిత పాల్గొన్నారు.
గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి సర్ ప్రక్రియ తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అల్లూరి శివాజీ, డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఎంపీడీవో ఇంతియాజ్, హౌసింగ్ డీఈ రమేశ్, ఏఈ గణేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిజామాబాద్ కలెక్టర్ ఆగ్రహం
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌అర్బన్ నియోజకవర్గంలో సర్ప్రక్రియ స్లోగా నడుస్తోందని కలెక్టర్ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణలో బీఎల్‌ఏలతోపాటు బీఎల్‌వోలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. శనివారం సిటీలోని 6వ డివిజన్కమ్యూనిటీ హాల్‌లో మేయర్ఉమారాణి, కార్పొరేటర్లు, బీఎల్వో, బీఎల్‌ఏ, సూపర్వైజర్లతో మీటింగ్ నిర్వహించారు. పవర్పాయింట్ప్రజెంటేషన్తో వివరాలు తెలిపి అర్బన్‌లో పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. నగర పాలక కమిషనర్దిలీప్కుమార్, నార్త్తహసీల్దార్ హరికిషోర్, ఎలక్షన్ వింగ్సూపరిటెండెంట్ బాలరాజు ఉన్నారు.
