గ్రామాల సమగ్ర అభివృద్ధే సర్పంచుల లక్ష్యం : పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

గ్రామాల సమగ్ర అభివృద్ధే సర్పంచుల లక్ష్యం : పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రతి సర్పంచ్​ ప్రధాన లక్ష్యంగా ఉండాలని, గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. వరంగల్​ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో శనివారం నిర్వహించిన గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) కింద సర్పంచులు, పంచాయతీ సెక్రటరీల శిక్షణ కార్యక్రమంలో వరంగల్​ కలెక్టర్ సత్య శారదతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలతో కలిసి జలసిరి ప్రతిజ్ఞ చేశారు. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచులు గ్రామ ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రజలకు అత్యవసరమైన అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆరోగ్యం, పారిశుధ్యం, తాగునీరు, విద్య, పచ్చదనం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగు చేసే పంటలు, సేంద్రియ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని ఆఫీసర్లకు సూచించారు. సమగ్ర ఓటర్ ఇంటింటి సర్వే జరుగుతుందని, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని కలెక్టర్​ తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో  రాంరెడ్డి, డీపీవో  కల్పన, డీఆర్డీవో నాగపద్మజ తదితరులు పాల్గొన్నారు.