భూముల రీ సర్వే స్పీడప్ చేయాలి: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

భూముల రీ సర్వే స్పీడప్ చేయాలి: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో భూముల రీ-సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సర్వే అసిస్టెంట్ డైరెక్టర్‌ను ఆదేశించారు. శనివారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ తొలివిడతగా 70 గ్రామాలను ఎంపిక చేసి 2027 మార్చి నాటికి రీ-సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

ఇందుకోసం లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకుంటూ, వారికి సకాలంలో పేమెంట్లు, బీమా, సామాజిక భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. అలాగే సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించి త్వరగా నోటీసులు జారీ చేయాలని సూచించారు. అనంతరం కేడీఆర్ నగర్, చందాపూర్ గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, సర్​ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతీ బీఎల్‌వో రోజుకు కనీసం 100 ఫారాలను డిజిటలైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వినోద్ కుమార్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రమేశ్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.