అక్లాండ్: మోదీ ప్రెస్మీట్ ఎందుకు పెట్టరు?...న్యూజిలాండ్ జర్నలిస్ట్ ప్రశ్న

అక్లాండ్: మోదీ ప్రెస్మీట్ ఎందుకు పెట్టరు?...న్యూజిలాండ్ జర్నలిస్ట్ ప్రశ్న

అక్లాండ్: ప్రధాని మోదీ మీడియా సమావేశాలు నిర్వహించకపోవడంపై న్యూజిలాండ్ పర్యటనలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. స్థానిక జర్నలిస్టులతో భారత దౌత్యాధికారులు జరిపిన ఒక సమావేశంలో.. ‘‘ప్రధాని మోదీ అసలు ప్రెస్ కాన్ఫరెన్స్‌‌లు ఎందుకు పెట్టరు?’’ అని ఒక విదేశీ జర్నలిస్ట్ నేరుగా ప్రశ్నించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ సీనియర్ అధికారి రుద్రేంద్ర టాండన్ స్పందించారు. 

‘‘ప్రధాని మోదీ పరిపూర్ణమైన భారతీయ రాజకీయ నాయకుడు. భారతీయ నాయకులు తమ ఓటర్లతో నేరుగా కనెక్ట్ అవ్వడానికే ఇష్టపడతారు. మధ్యవర్తుల ద్వారా మాట్లాడటం వారికి నచ్చదు. మోదీ ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకునే కళను పూర్తిగా పుణికిపుచ్చుకున్నారు. అందుకే ఆయన వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి, అత్యంత సుదీర్ఘకాలం పనిచేస్తున్న ప్రధానులలో ఒకరిగా నిలిచారు”అని టాండన్ బదులిచ్చారు.