నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటం... ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శపథం...

నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటం... ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శపథం...
  • మేం ఉన్నా, లేకపోయినా.. అది జరిగి తీరుతుంది 

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్, తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన కొడుకు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శపథం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ, ఇతర నేతల రక్తం చిందిందని.. అందుకుగాను ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు, తనను చంపితే .. ఆ మరు క్షణమే ఇరాన్‌‌‌‌పైకి దూసుకెళ్లేందుకు 1,000 మిసైళ్లను లోడ్ చేసి రెడీగా ఉంచామని ట్రంప్​ కౌంటర్​ ఇచ్చారు.

టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్, తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన కొడుకు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శపథం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ, ఇతర నేతల రక్తం చిందిందని.. అందుకుగాను ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు సోషల్ మీడియాలో మొజ్తబా లిఖిత పూర్వక సందేశం విడుదల చేశారు. 

‘‘ఈ యుద్ధంలో అమరులైన వీరులందరి రక్తావిష్కారానికిగాను ఆ హంతకులపై ప్రతీకారం తీర్చుకుంటామని మేం శపథం చేస్తున్నాం" అని ఆ సందేశంలో పేర్కొన్నారు. ఇరాన్ ప్రతీకారం తప్పనిసరిగా తీరుతుందన్నారు. ఈ విషయం తన వ్యక్తిగత ఉనికిపై లేదా ఇతర అధికారులపై ఆధారపడి లేదని చెప్పారు. ‘‘మేం ఉన్నా లేకపోయినా, అది జరిగి తీరుతుంది’’ అని మొజ్తబా స్పష్టం చేశారు. అలీ ఖమేనీ అంతిమయాత్రకు లక్షలాదిగా తరలివచ్చి శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

‘‘ఇరాన్, ఇరాక్ అంతటా, ముఖ్యంగా టెహ్రాన్, ఖోమ్, నజాఫ్, కర్బలా, మషద్‌‌లలో లక్షలాది మంది ప్రజలు అద్భుతంగా, శత్రువులను ముక్కలు చేసేలా, చారిత్రాత్మకంగా తరలివచ్చినందుకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని ఆయన రాశారు. ఫిబ్రవరి 28న అమెరికా-, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన అలీ ఖమేనీకి కొన్ని నెలల తర్వాత గురువారం అర్ధరాత్రి అంత్యక్రియలు జరిగిన సందర్భంగా మొజ్తబా ఈ మేరకు శపథం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.