కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆరపేట శివారులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో పురుగులు పట్టిన అన్నం, కుళ్లిపోయిన కూరగాయలు వడ్డిస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ లీడర్లు శనివారం ధర్నా నిర్వహించారు. తల్లిదండ్రులతో కలిసి గురుకులాన్ని సందర్శించిన బీజేపీ లీడర్లు.. దుర్వాసన కలిగిన కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో విద్యార్థులకు అన్నం పెట్టడంపై ప్రిన్సిపాల్‌ను నిలదీశారు.
అనంతరం గురుకులం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని, డైనింగ్ హాల్లో ఫ్యాన్లు పనిచేయలేదని, హెల్త్చెకప్ చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈవో కనకతార స్కూల్‌కు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
