గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గ పరిధిలోని మాల్యాలపల్లి–- బద్రిపల్లి గ్రామాల ప్రజల రాకపోకల సౌకర్యార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేదా రోడ్అండర్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను రైల్వే డివిజనల్యూజర్స్కమిటీ మెంబర్, కాంగ్రెస్ సీనియర్లీడర్అనుమాస శ్రీనివాస్ కోరారు. శనివారం గోదావరిఖనికి వచ్చిన ఎంపీకి ఆయన వినతిపత్రం అందజేశారు.
రామగుండం నుంచి గోదావరిఖని కోల్ మైన్ సైడింగ్‌కు వెళ్లే మార్గంలోని మాల్యాలపల్లి, బద్రిపల్లి గ్రామాల మధ్య గూడ్స్ రైళ్లు తరచుగా రైల్వే గేట్లపై ఎక్కువసేపు నిలిచిపోవడం వల్ల ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
