షాబాద్ సైకో కనిపించిండు.. పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నరన్న ప్రత్యక్ష సాక్షి.. ఎక్కడంటే..

షాబాద్ సైకో కనిపించిండు.. పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నరన్న ప్రత్యక్ష సాక్షి.. ఎక్కడంటే..

రంగారెడ్డి: పోక్సో కేసులో బెయిల్పై బయటికొచ్చి ఆరు హత్యలు చేసిన చేసిన షాబాద్ సైకో రాజ్ కుమార్ కొత్తూరు మండలం కుమ్మరి గూడెం గ్రామంలో కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షి  బండారు సుధాకర్ చెప్పాడు. నిందితుడిని పోలీసులు పట్టుకొని తీసుకెళ్లారని చెప్పాడు. 

షాబాద్ ఆరు హత్యల ఘటనలో ప్రధాన నిందితుడైన రాజ్ కుమార్ను ప్రత్యక్షంగా చూసినట్లు చెబుతున్న సుధాకర్.. సైకో పారిపోతుండగా అతనిని ఒక కానిస్టేబుల్ పట్టుకొని తీసుకెళ్లాడని తెలిపాడు. రాజ్ కుమార్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

శుక్రవారం రాత్రి రాజ్ కుమార్ సెల్ఫ్‌‌ డ్రైవ్‌‌ కారు తీసుకున్నాడు. రాత్రి 11.10  గంటలకు బాలిక ఇంటికి వచ్చాడు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. తలుపు కొట్టడంతో బాలిక తల్లి డోర్‌‌‌‌ ఓపెన్ చేసింది. ఇంట్లోకి వెళ్లిన ఈ సైకో బాలికను తనతో లాక్కెళ్లే ప్రయత్నం చేయడంతో బాలిక తల్లి అడ్డుపడింది. 

దీంతో తన చేతిలో కత్తితో కడుపు, ఛాతిలో ఆరు పోట్లు పొడిచాడు. నిద్రిస్తున్న బాలిక నాయనమ్మ రుక్కమ్మను పొడిచి చంపాడు. అరిస్తే చంపేస్తానని బెదిరిస్తూ.. బాలికను బలవంతంగా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు.

సమీపంలోని అఖిల్‌‌సాగర్‌‌‌‌ చెరువు వద్ద ఆమె గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం దైవాలగూడలోని తన ఇంటికి వెళ్లాడు. తలుపు తట్టడంతో భార్య డోర్ ఓపెన్ చేసింది. దీంతో ఆమెపై దాడి చేసి కడుపులో బలంగా మూడు పోట్లు పొడిచాడు. అరవకుండా గొంతు కోశాడు. 

పక్కనే బెడ్‌‌పై నిద్రిస్తున్న పరీక్షిత్, దైవీక్షిత్‌‌ గొంతులు కోశాడు. ఇలా రాత్రి 11.10 గంటల నుంచి 11.45 గంటల మధ్య సమయంలో కేవలం అరగంట వ్యవధిలో ఆరు ప్రాణాలను తీశాడు. రాజ్‌‌కుమార్‌ ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షలు రివార్డ్ అందిస్తామని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.