రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేవాలగూడలో జరిగిన ఆరుగురి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
కిరాతకుడి నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులకు చెప్పినా సరిగ్గా స్పందించలేదని ఆరోపిస్తూ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. కేసు పెట్టిన సరైన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆరుగురు హత్యలకు సీఐ, ఎస్ఐ లే కారణమని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆరుగురి మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దేవాలగూడలో శుక్రవారం (జులై 10) అర్థరాత్రి పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేసిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులతో పాటు బాధిత బాలిక కుటుంబంలోని వ్యక్తులతో కలిపి మొత్తం ఆరుగురిని హత్య చేసిన కేసు రాష్ట్రాన్ని, దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది.
నిలువెల్లా నేర ప్రవృత్తి:
ఆరుగురిని హత్య చేసిన మానవ మృగం మానసిక ప్రవృత్తిని గురించి తవ్వే కొద్ది షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. గతంలో ఇంటి పక్కన ఉండే అమ్మాయిని ట్రాప్ చేసి ఆమె కాలేజ్కు వెళ్లే దారిలో ఆమెను ఇబ్బందిపెట్టేవాడని గ్రామస్తులు తెలిపారు. ఆమె వెళ్లే బస్సుకు అడ్డం తగిలి బస్సు దిగాలని.. కారులో పోదామని ఆమెను ఇబ్బందిపెట్టేవాడని గ్రామస్తులు చెప్పారు.
ఈ విషయం తమకు తెలియడంతో.. అతనిని హెచ్చరించి.. బాధిత బాలికకు రక్షణగా గ్రామస్తులు కాలేజ్కు ఆమె వెళ్లి వచ్చే వరకూ ఉండేవారని తెలిపారు. ఒకరోజు.. బాలికను బలవంతంగా తీసుకెళుతుంటే.. అడ్డు తగిలిన గ్రామస్తురాలికి నిందితుడు వార్నింగ్ కూడా ఇచ్చాడని చెప్పారు.
నీ మొగుడిని నేను సంవత్సరం కిందనే చంపినా.. ఎవడేమన్నా పీకిండా.. పోలీసులకు పైసలు పారేస్తే నన్ను ఎవరూ ఏం చేయరు అని బాలికకు రక్షణగా ఉన్న గ్రామస్తురాలితో అనడంతో ఆమె షాకైంది. ఆమె భర్తను కూడా నిందితుడే చంపినట్లు స్వయంగా నిందితుడే చెప్పడంతో బాధిత బాలికపై ఘోరానికి పాల్పడక ముందే నిందితుడికి నేర చరిత్ర ఉందని స్పష్టమైంది. పోక్సో కేసు ఫైల్ అయిన తర్వాత కూడా నిందితుడు బెయిల్పై దర్జాగా బయటతిరిగాడని, బాధితురాలికి ప్రమాదం ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని గ్రామస్తులు చెప్పారు. గ్రామ సర్పంచ్ కూడా పోలీసులకు తొత్తుగా పనిచేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు.
మనిషి కాదు మృగం..
మైనర్ పై అత్యాచార వేధింపుల ఆరోపణలతో.. పోక్సో కేసులో అరెస్టైన మృగం.. బెయిల్ పై బయటికొచ్చి అత్యంత క్రూర దారుణానికి పాల్పడ్డాడు. పోక్సో కేసు పెట్టారనే కసితో ఆరుగురిని చంపేశాడు దుర్మార్గుడు. శుక్రవారం (జులై 10) అర్థరాత్రి రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురిని దారుణంగా చంపాడు కిరాతకుడు. బెయిల్ పై బయటికి వచ్చిన కిరాతకకుడు.. మొదటగా ఇంటికి వెళ్లి తన భార్య, ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత పోక్సో కేసు పెట్టిన బాధిత బాలిక కుటుంబంలో మరో ముగ్గురిని హత్య చేశాడు.
బాలికను వేధించినందుకు రాజ్‌కుమార్‌పై గతంలో పోక్సో కేసు నమోదైంది. మే 26న అరెస్ట్ అయి జైలుకెళ్లిన దుర్మార్గుడు.. శుక్రవారం (జులై 10) బెయిల్‌పై తిరిగి వచ్చి అత్యంత కిరాతకంగా దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి వెళ్లి తన భార్య, ఇద్దరు పిల్లల హత్య చేశాడు. ఆ తర్వాత బాధిత బాలిక, తల్లి, నాయనమ్మలను హత్య చేశాడు. బాలికను ఊరి శివారల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు.
మృతుల వివరాలు :
వరుస హత్యలు చేసి పరారైన నిందితుడు రాజ్‌కుమార్ ఆ తర్వాత విషయం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. చెప్పిన నిందితుడు.. తాను కూడా చనిపోతున్నట్టు బంధువులకు ఫోన్లు.. వెంటనే పోలీసులకు రాజ్‌కుమార్ తల్లిదండ్రుల సమాచారం.. మృతులు చిట్యాల రుక్కమ్మ (65), చిట్యాల లక్ష్మి (45), మైనర్ బాలిక (17), భార్య పార్వతి సరిత (30), కుమారుడు పరీక్షిత్ (3), కుమార్తె దైవిక్షిత్ (2)
