Women Special: మహిళల్లారా ఈ టిప్స్ పాటించండి.. కూరలు క్షణాల్లో తయారవుతాయి..!

Women Special: మహిళల్లారా ఈ టిప్స్ పాటించండి.. కూరలు క్షణాల్లో తయారవుతాయి..!

ప్రస్తుత రోజుల్లో ఆలు మగలు జాబ్​ చేయనిదే ఇల్లు గడవడం కష్టం.. అలాంటప్పుడు మహిళలు.. ఆఫీస్​ పని.. వంట పనితో సతమతమవుతుంటారు.  ఓ పక్క పిల్లలకు బాక్స్​ సర్దడం.. పాఠశాలకు పంపడం.. భర్తకు కావలసినవి ఇవ్వడం.. తాను తయారవడం ఇలా టైంతో సతమతమవుతుంటారు.  ఇక ఇంట్లో పెద్దవారుంటే ఇక సరే సరి. సమయానికి వంటకాకపోతే  ఆ ఇల్లాలు కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. మరి అలాంటప్పుడు కూరలు త్వరగా తయారవ్వాలంటే ఎలాంటి టిప్స్​ పాటించాలో ఈస్టోరీలో తెలుసుకుందాం. . 

  • ఆలుగడ్డలు త్వరగా ఉడకాలంటే.. ఉడికించే నీళ్లలో ఉప్పు వేస్తే పొట్టు తేలిగ్గా వస్తుంది.
  • పచ్చి బఠాణీలు రంగు నచ్చనివాళ్లు.. వాటిని ఉడికించేటప్పుడు కొద్దిగా చక్కెర వేస్తే రంగు మారతాయి.
  • నూడుల్స్, పాస్తాల్ని ఉడికించాక కాసేపు చల్లటి నీళ్లలో ఉంచితే అతుక్కోవు.
  • పకోడీలు కరకరలాడాలంటే శెనగపిండి లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలపాలి.
  • మసాలాలు మంచి రంగులో, టేస్టీగా ఉండాలంటే.. మసాలా దినుసుల్ని సన్నని మంటపై వేగించి, మిక్సీ పట్టాలి.
  • అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ లలో ఒక టీ స్పూన్ వేడి నూనె వేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్​ గా ఉంటాయి.
  •  అన్నం పొడిపొడిగా కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ నూనె వేసి ఉడికించాలి.
  • ఉప్పు నీళ్లలో ఆలుగడ్డల్ని ఇరవై నిమిషాలు నానబెడితే.. త్వరగా ఉడుకుతాయి.