హుస్సేన్సాగర్ తీరాన బంగీ జంప్!...త్వరలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు

హుస్సేన్సాగర్ తీరాన బంగీ జంప్!...త్వరలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు
  •   పిల్లల కోసం   కిడ్స్ ట్రాంపోలిన్ 
  • సరికొత్త ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ కసరత్తు
  • అడ్వెంచర్స్​గేమ్స్​తో  విజిటర్స్​ను ఆకట్టుకునే ప్లాన్​

హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో సందర్శకులను ఆకట్టుకునేందుకు మరో కొత్త ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ తీసుకురాబోతున్నది. హుస్సేన్​సాగర్​తీరాన ఉన్న ఎన్టీఆర్​గార్డెన్స్​, లుంబినీ పార్కుల్లో మరిన్ని ప్రత్యేక ఆకర్షణలను కల్పించడం ద్వారా సందర్శకులు, పర్యాటకుల సంఖ్యను పెంచాలని చూస్తోంది. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో త్వరలో బంగీ ట్రాంపోలిన్ (బంగీ జంప్​), పిల్లల కోసం కిడ్స్ ట్రాంపోలిన్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ లోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధికారులు చెప్పారు. కేవలం బంగీజంప్, కిడ్స్​ట్రాంపోలిన్​ మాత్రమే కాకుండా ఇతర ఆకర్షణల ఏర్పాటుకూ సిద్ధమవుతున్నారు.  

బంగీ జంప్​ అడ్వెంచర్​ క్రీడ

సాధారణంగా పిక్నిక్​ స్పాట్​లు, గార్డెన్స్​కు వచ్చే విజిటర్స్​అడ్వెంచర్​ క్రీడలను ఎక్కువ ఇష్టపడతారు. వేరే రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నా బంగీ జంప్​ను తెస్తే మరింత మంది సందర్శకులు వస్తారని హెచ్ఎండీఏ భావిస్తోంది. అందుకే ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఆర్ గార్డెన్స్ మెయిన్​ఎంట్రన్స్​వద్ద, లుంబిని పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ టూరిజం డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (టీటీడీసీ) బోటింగ్ టికెట్ కౌంటర్ వెనుక బంగీ ట్రాంపోలిన్, కిడ్స్ ట్రాంపోలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టును మూడేండ్ల పాటు ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించనున్నారు. టెండర్ ద్వారా సంస్థను ఎంపిక చేసి ఏర్పాటు, నిర్వహణ, మెయింటెనెన్స్​బాధ్యతలు వారే చూసుకునేలా చేయనున్నారు. 

టికెట్​ రేట్లు ఇలా ఉండొచ్చు

బంగీ ట్రాంపోలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక్కో వ్యక్తికి రూ.60, కిడ్స్ ట్రాంపోలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.40గా ప్రతిపాదించారు. ఏర్పాటు చేశాక ఈ రేట్లలో కొంత మార్పులు ఉండే అవకాశం ఉందంటున్నారు. రెండో సంవత్సరం నుంచి టికెట్ ధరలను పెంచాలంటే ఏడాదికి గరిష్ఠంగా 10 శాతం వరకు మాత్రమే పెంచేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.