లెనిన్ ఊహించిన దానికంటే పెద్ద విజయం: నిర్మాత నాగవంశీ

లెనిన్  ఊహించిన దానికంటే పెద్ద విజయం: నిర్మాత నాగవంశీ

మంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని నాగార్జున అన్నారు.  అఖిల్ నటించిన ‘లెనిన్’  చిత్రం ఇటీవల విడుదలై  పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో  మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘అఖిల్‌‌‌‌కు మంచి విజయం రావాలని ఎంతోకాలంగా ఎదురుచూశా.  ప్రేక్షకుల ఆదరణతో 'లెనిన్' ఆ విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది.  

అఖిల్ కష్టానికి తగిన ఫలితం దక్కింది’ అని అన్నారు.  మంచి కంటెంట్‌‌‌‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రోత్సహిస్తారని మరోసారి నిరూపించారని అఖిల్ అన్నాడు.  తాను పోషించిన భారతి పాత్రకు మంచి ఆదరణ దక్కడం, ఈ మూవీతో హిట్ అందుకోవడం ఆనందంగా ఉందని భాగ్యశ్రీ బోర్సే చెప్పింది. ఈ సక్సెస్‌‌‌‌లో తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ దర్శకుడు మురళీ థ్యాంక్స్ చెప్పాడు.  నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘విడుదలైన అన్ని సెంటర్స్‌‌‌‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.  ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించింది. దీనికి  సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పారు.