క్వీన్ మూవీలో ముఖ్యమంత్రిగా రమ్యకృష్ణ

క్వీన్ మూవీలో  ముఖ్యమంత్రిగా  రమ్యకృష్ణ

యామినీ ఈఆర్‌‌‌‌‌‌‌‌ లీడ్ రోల్‌‌‌‌లో రతన్ రిషి తెరకెక్కిస్తున్న హీరోయిన్ సెంట్రిక్ మూవీ ‘క్వీన్’.  వన్ సర్కిల్ ఫిలింస్ నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో  పవర్‌‌‌‌‌‌‌‌పుల్‌‌‌‌ అండ్ స్ట్రాంగ్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో రమ్మకృష్ణ నటించబోతున్నారని  మేకర్స్ తెలియజేశారు.

 ఏపీ సీఎంగా లక్ష్మి ప్రణతి అనే పాత్రలో ఆమె కనిపించబోతున్నారని తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను రివీల్‌‌‌‌ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గతంలో ‘క్వీన్‌‌‌‌’ టైటిల్‌‌‌‌తో వచ్చిన వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో తమిళనాడు సీఎం జయలలితగా రమ్యకృష్ణ నటించిన విషయం తెలిసిందే. ఇక ‘క్వీన్’ చిత్రాన్ని రియల్‌‌‌‌ ఇన్సిడెంట్స్‌‌‌‌, రియల్‌‌‌‌ క్యారెక్టర్స్‌‌‌‌ స్ఫూర్తితో ఫిక్షనల్‌‌‌‌ స్టోరీతో 2006–10 నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు రతన్ రిషి చెప్పారు.  ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రిగా సాయికుమార్,  విలన్స్‌‌‌‌గా కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ నటిస్తున్నారు. తనికెళ్ల భరణి, నవీన్ బేతిగంటి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.