తెలంగాణలో తడారుతున్న ప్రాజెక్టులు..355 టీఎంసీల లైవ్ స్టోరేజ్ కు గానూ..ఉన్నది 44.53 టీఎంసీలే

తెలంగాణలో తడారుతున్న ప్రాజెక్టులు..355 టీఎంసీల లైవ్ స్టోరేజ్ కు గానూ..ఉన్నది 44.53 టీఎంసీలే
  • 355 టీఎంసీల లైవ్ ​స్టోరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుగానూ.. ఉన్నది 44.53 టీఎంసీలే
  • సీడబ్ల్యూసీ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెల్లడి.. దేశంలోనే తెలంగాణలో అత్యల్ప స్టోరేజ్​
  • సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6.5 టీఎంసీలే వాడుకునే వీలు.. శ్రీరాంసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ 16 టీఎంసీలే
  • ఆ 2 ప్రాజెక్టుల కిందే రాష్ట్రంలో 17 లక్షల ఎకరాల దాకా సాగు

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రంలోని ఇరిగేషన్​ ప్రాజెక్టులు దినదినం దీనస్థితిలోకి జారుకుంటున్నాయి. వర్షాలుపడక.. వరదలు లేక తడారిపోతున్నాయి. దేశంలోనే అత్యల్పంగా నీళ్లున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణే మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 166 ప్రాజెక్టుల్లో లైవ్​ స్టోరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) ఇచ్చిన రిపోర్టులో కలవరపెట్టే అంశాలు వెల్లడయ్యాయి. గతవారంతో పోలిస్తే ప్రాజెక్టుల్లోని జలాలు గణనీయంగా పడిపోయాయి. రాష్ట్రంలో సీడబ్ల్యూసీ 8 ప్రధాన ప్రాజెక్టులను మానిటర్​ చేస్తున్నది.

నాగార్జునసాగర్​, శ్రీరాంసాగర్​, జూరాల, కడెం, లోయర్​ మానేరు, నిజాంసాగర్​, సింగూరు, మూసీ ప్రాజెక్టుల డేటానే సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకున్నది. సీడబ్ల్యూసీ రిపోర్ట్​ ప్రకారం ఆ 8 ప్రాజెక్టుల్లోని లైవ్​ స్టోరేజ్​ సుమారు 355 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 44.53 టీఎంసీల జలాలే ఉన్నాయి. అంటే లైవ్​స్టోరేజ్​లో ఉన్న నీళ్లు దాదాపు 13 శాతం. ఇది దేశంలోనే అత్యల్ప లైవ్​ స్టోరేజ్​అని సీడబ్ల్యూసీ తన రిపోర్టులో వెల్లడించింది. గతవారం 48 టీఎంసీల జలాలుండగా.. 3 టీఎంసీలకుపైగా నీళ్లు తగ్గిపోయాయి. నిరుడు ఇదే సమయానికి ఆ 8 ప్రాజెక్టుల్లో 106 టీఎంసీల నీళ్లుండగా.. ఇప్పుడు అందులో సగం కూడా ప్రాజెక్టుల్లో లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. 

సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడిపోతున్నయ్​..నాగార్జునసాగర్​ ప్రాజెక్టులో లైవ్​స్టోరేజ్​ 180 

టీఎంసీలుకాగా.. ప్రస్తుతం కేవలం 6.5 టీఎంసీల నిల్వ మాత్రమే ఉండడం కలవరపరుస్తున్నది. తెలంగాణకు అత్యధికంగా ఈ ప్రాజెక్టు ద్వారానే యాసంగి, వానాకాలం సీజన్లకు సాగునీటిని ఇస్తుంటారు. నిరుడు ఇదే టైంకు ప్రాజెక్టులో లైవ్​స్టోరేజ్​లో 45.41 టీఎంసీల నీళ్లుండగా.. ఇప్పుడు అందులో కేవలం 14 శాతమే నీళ్లున్నాయి. ఇటు ఉత్తర తెలంగాణకు అత్యంత కీలకమైన శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుదీ అదే పరిస్థితి. ఆ ప్రాజెక్టులో 66  టీఎంసీల లైవ్​స్టోరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుగానూ.. ప్రస్తుతం కేవలం 16 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. 

వరద రాకుంటే ఎట్ల..

మన దగ్గర వర్షాలు లేకున్నా.. ఎగువన వర్షాలు పడుతుండడంతో వరద వస్తుందేమోనన్న ఆశ కొంచెం ఉండేది. కానీ, ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టాయి. ఈ వారం నుంచి ఎగువన కూడా వర్షాలు తక్కువే ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఇప్పుడిప్పుడే కృష్ణాలో వరద మొదలవుతున్న తరుణంలోనే వర్షాలు తగ్గిపోతుండడం ఇక్కడ ఆందోళన కలిగిస్తున్నది. ఈ నెలంతా వర్షాభావ పరిస్థితులే ఉంటాయన్న అంచనాలతో.. వరదలూ తక్కువే ఉంటాయన్న అంచనాకు అధికారులు వస్తున్నారు. అదే జరిగితే మన రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులకు వరదలు రావని, ఇరిగేషన్​కు అత్యంత గడ్డుకాలంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిరుడు ఇదే టైంకు ఈ ప్రాజెక్టులోనూ మెండుగా 

నీళ్లున్నాయి. గత ఏడాది వానాకాలంలో 20 టీఎంసీల వరకు వాటర్​ ప్రాజెక్టులో ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల కిందే మన రాష్ట్రంలో దాదాపు 17 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం ఆ రెండు ప్రాజెక్టులు కూడా వరద తాకిడి కోసం వేచి చూస్తున్నాయి. జూరాల ప్రాజెక్టులో లైవ్​స్టోరేజ్​ 6 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం కేవలం 2 టీఎంసీలే ఉన్నాయి. మూసీలో 4.3 టీఎంసీలకుగానూ.. 3.4 టీఎంసీలు, సింగూరులో 29 టీఎంసీలకుగానూ 4.5 టీఎంసీలు, కడెంలో 4.8 టీఎంసీలకుగానూ 0.46 టీఎంసీలు, లోయర్​ మానేరులో 22 టీఎంసీలకుగానూ 5.7 టీఎంసీలు, నిజాంసాగర్​లో 17 టీఎంసీలకుగానూ 6.6 టీఎంసీల నీళ్లున్నాయి. తెలుగు రాష్ట్రాలకు మరో కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టుది మరీ దయనీయమైన పరిస్థితి. ఆ ప్రాజెక్టులో లైవ్​స్టోరేజ్​ 212 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 38.66 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. అది డెడ్​స్టోరేజ్​లోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి చుక్క నీరు కూడా తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. 

మన లెక్కకు.. సీడబ్ల్యూసీ లెక్కకు ఫరక్​

దేశంలోని ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై రిజర్వాయర్​ స్టోరేజ్​ మానిటరింగ్​ సిస్టమ్​ (ఆర్‌‌‌‌‌‌ఎస్‌‌ఎంఎస్​) ద్వారా సీడబ్ల్యూసీ గణాంకాలను ఇస్తుంటుంది. మన రాష్ట్రంలోని 8 ప్రాజెక్టులనే ఆర్‌‌‌‌ఎస్‌‌ఎంఎస్​ ద్వారా పర్యవేక్షిస్తున్నది. అదే సమయంలో మన అధికారులు కూడా రెండు మూడేండ్ల కిందట ఇరిగేషన్​ డెసిషన్​ సపోర్ట్​ సిస్టమ్​(ఐడీఎస్‌‌ఎస్​)ను అభివృద్ధి చేసింది. ఆర్‌‌‌‌ఎస్​ఎంఎస్‌‌లో సీడబ్ల్యూసీ చూపిస్తున్న డేటాకు.. ఐడీఎస్​ఎస్​లోని డేటాకు ఫరక్​ ఉంటున్నది. ఉదాహరణకు నాగార్జునసాగర్​ ప్రాజెక్టులో ఐడీఎస్ఎస్​ ప్రకారం లైవ్​స్టోరేజ్​ 200 టీఎంసీలు కాగా.. సీడబ్ల్యూసీ మాత్రం కేవలం 180 టీఎంసీలుగానే చూపిస్తున్నది. లైవ్​స్టోరేజ్​లో 20 టీఎంసీలున్నట్టు మన లెక్కలు చెప్తుండగా.. సీడబ్ల్యూసీ మాత్రం కేవలం 6.5 టీఎంసీలే ఉన్నాయని స్పష్టం చేస్తున్నది. అదే సమయంలో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యమే 80 టీఎంసీలైతే.. ఆ మొత్తాన్నీ లైవ్​స్టోరేజ్​గానే సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంటున్నది.