ఈపీఎఫ్‌‌ను జీపీఎఫ్‌‌గా మార్చాలి..మంత్రి వివేక్‌కు విద్యుత్‌ ఇంజనీర్ల వినతి

ఈపీఎఫ్‌‌ను జీపీఎఫ్‌‌గా మార్చాలి..మంత్రి వివేక్‌కు విద్యుత్‌ ఇంజనీర్ల వినతి

హైదరాబాద్, వెలుగు:  విద్యుత్ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన ఈపీఎఫ్‌‌ను జీపీఎఫ్‌‌గా మార్చాలని విద్యుత్ సంస్థ ఇంజినీర్లు మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆదివారం హైదరాబాద్‌‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. 1999 నుంచి 2004 మధ్య ఉద్యోగాల్లో చేరిన సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, దాదాపు 5 వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో డీఈ మంగీలాల్, ఇంజనీర్లు కేవీ కృష్ణారావు, రాఘవేందర్ రెడ్డి, సీతారామరాజు, జాన్ వెస్లీ తదితరులు ఉన్నారు.