విజయ్ 'జననాయగన్' కౌంట్‌డౌన్ షురూ.. ఇండియాలో 'A' సర్టిఫికేట్, యూకేలో అన్‌కట్ రచ్చ!

విజయ్ 'జననాయగన్' కౌంట్‌డౌన్ షురూ.. ఇండియాలో 'A' సర్టిఫికేట్, యూకేలో అన్‌కట్ రచ్చ!

తమిళనాడు సీఎం , కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఆఖరి చిత్రం 'జననాయగన్' రిలీజ్ కు కౌంట్ డౌన్ రెడీ అయింది.  జూల్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్నో వాయిదాలు, వివాదాల తర్వాత ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఇండియాలో  'A'సర్టిఫికేట్ ఇచ్చింది. పలు మార్పులను కూడా చూచించింది. దీంతో పెద్దలకు మాత్రమే థియేటర్లలో చూసేందుకు అనుమతి ఉంది.

యూకేలో కంప్లీట్ అన్‌కట్..

అయితే ఇదే మూవీ  యునైటెడ్ కింగ్‌డమ్ లో  మాత్రం ఎలాంటి కట్స్ లేకుండా 'కంప్లీట్ అన్‌కట్' వెర్షన్‌తో థియేటర్లలోకి వస్తుంది. యూకే సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 15  రేటింగ్ ఇచ్చింది. అంటే, డైరెక్టర్ హెచ్. వినోద్ స్క్రీన్‌పై ఏ మ్యాజిక్ అయితే చూపించాలనుకున్నారో, ఆ పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ అండ్ కమర్షియల్ మాస్ సీన్స్ అన్నీ కూడా ప్రేక్షకులు ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఉన్నదున్నట్టుగా థియేటర్లలో ఎక్స్ పీరియన్స్ చేయబోతున్నారు. ఇది ఇప్పుడు బ్రిటిష్ ఆడియన్స్ లో ఫుల్ జోష్ నింపింది.

ఇండియాలో A సర్టిఫికేట్..

జూలై 24న గ్రాండ్ గా యునైటెడ్ కింగ్ డమ్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు యూకే డిస్ట్రిబ్యూటర్ అహింస ఎంటర్‌టైన్‌మెంట్స్సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అయితే ఇండియాలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. సెన్సార్ ఇబ్బందుల వల్ల ఈ సినిమా ఏకంగా ఏడు నెలల పాటు ఆలస్యమైంది. ఎట్టకేలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి కొన్ని మేజర్ కట్స్ సూచించింది. దాదాపు 12 కీలక మార్పులు చేసిన తర్వాతే భారత్‌లో ఈ సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చి క్లియర్ చేశారు.

►ALSO READ | Mahesh Babu Nephew: కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు షేర్ చేసిన నమ్రత

రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇవ్వడానికి ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా ఇదే కావడంతో.. దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే యూకే వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా..  టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హెచ్. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దళపతి చివరి వేట థియేటర్లలో ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి..