మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత క్లాసిక్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి గ్రాండ్గా నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 7న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ వరుస ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. లేటెస్ట్గా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ‘కొరియన్ కనకరాజు’ టీజర్ రిలీజ్ చేశారు. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. వరుణ్ తేజ్ రఫ్ అండ్ స్టైలిష్ అవతార్‌లో మెగా ఫ్యాన్స్ను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు.
మాది రాయలసీమ.. మా ఊరు పెనుకొండ.. కనకరాజు గాడికి బలమైన కారణం ఉంటే తప్ప మందు ముట్టను అని టీజర్ మొదలైంది. ఆ తర్వాత హీరోయిన్ కొరియన్ భాషలో మాట్లాడుతూ ఎంట్రీ ఇవ్వడం, వరుణ్ తేజ్ పిచ్చిగా ప్రవర్తించడం, కళ్ళు వేరే కలర్లో మారడం, హార్రర్ టోన్ని ఎలివేట్ చేసింది. ఇక టీజర్ చివర్లో పవన్ కళ్యాణ్ 'ఓజీ' స్టైల్ మాదిరిగా వరుణ్ గ్యాంగ్ స్టార్ లుక్లో ఎంట్రీ ఇవ్వడం టీజర్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. తమన్ బిజియం కామెడీ హార్రర్ థీమ్తో కొత్తగా ఉంది.
ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, హారర్, కామెడీ, కొరియన్ కల్చర్ ఎలిమెంట్స్‌తో ఫన్నీగా చూపిస్తూ భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు.
బలమైన ‘కమ్ బ్యాక్’ దిశగా..
వరుణ్ తేజ్ గత చిత్రాలు ఆపరేషన్ వాలెంటైన్, గాండీవధారి అర్జున, మట్కా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో వరుణ్ ఉన్నారు. ఈ క్రమంలోనే హారర్, ఫాంటసీకి కామెడీ నేపథ్యాన్ని ఎంచుకుని, మేర్లపాక గాంధీ వంటి సెన్సిబుల్ డైరెక్టర్ తో వస్తున్నాడు. గతంలో హారర్, ఫాంటసీ జోనర్లో వచ్చిన ‘అరుంధతి’ లేదా ‘ముంజ్య’ వంటి చిత్రాలు సక్సెస్ అయ్యి సత్తా చాటాయి. ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ కూడా అదే దారిలో వెళ్లి వరుణ్ తేజ్‌కు ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
►ALSO READ | Mahesh Babu Nephew: కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి ఎంగేజ్‌మెంట్..
కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ... 😎💥
— UV Creations (@UV_Creations) July 10, 2026
Get ready for the wildest Indo-Korean horror comedy ride of the year with #KoreanKanakaraju 🐉😈#KOKA GRAND RELEASE WORLDWIDE IN CINEMAS ON AUGUST 7th, 2026 ❤️🔥@IamVarunTej @GandhiMerlapaka @RitikaNayak_ @MusicThaman #ManojhReddy… pic.twitter.com/BhgLFQN73g
