హార్మూజ్‎ను అమెరికా కంట్రోల్ చేస్తది.. ఇకపై మాకే పన్నులు కట్టాలి: ట్రంప్ సంచలన ప్రకటన

హార్మూజ్‎ను అమెరికా కంట్రోల్ చేస్తది.. ఇకపై మాకే పన్నులు కట్టాలి: ట్రంప్ సంచలన ప్రకటన

వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి నియంత్రణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హోర్ముజ్‎ జలసంధిని అమెరికా ఆధీనంలోకి తీసుకుంటుందని.. ఇరాన్ నుంచి దానిని రక్షిస్తునందుకు ప్రతిఫలంగా అమెరికాకు పన్నులు చెల్లించాలని కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం (జులై 13) ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  ‘‘మేము హార్మూజ్ జలసంధిని కాపాడుతాం. బహుశా దానిని మేమే నియంత్రిస్తాం. మేము ఆ జలసంధికి సంరక్షకులుగా మారతాము. అందుకు మాకు పరిహారం చెల్లించాలి’’ అని వ్యాఖ్యానించారు. 

కాగా, 2026, ఫిబ్రవరిలో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మొదలు కాగా.. నాలుగు నెలల అనంతరం జూన్‎లో ఇరుదేశాల మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో యుద్ధం ముగియగా.. హార్మూజ్ జలసంధి గుండా ప్రపంచ నౌకయానానికి మార్గం సుగమైంది. అయితే, ఇటీవల ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో హర్మూజ్ జలసంధిని మళ్లీ క్లోజ్ చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా ఆ జలసంధి గుండా వెళ్తున్న నౌకలపై దాడులు చేసింది. ఈ దాడులకు కౌంటర్‎గా ఇరాన్‎పై అమెరికా విరుచుకుపడింది. దీంతో ఇరుదేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. 

►ALSO READ | ఈ 13 మందిని లేపేస్తం.. ఇరాన్ హిట్ లిస్ట్ రిలీజ్.. జాబితాలో ట్రంప్, నెతన్యాహు, మెలోని..!

అమెరికా, ఇరాన్ దాడులు, ప్రతీ దాడులతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంటుంది. ఈ తరుణంలో హర్మూజ్ జలసంధిని మేమే నియంత్రిస్తామని.. ఇకపై మాకే పన్నులు కట్టాలని ట్రంప్ పేర్కొనడం ప్రపంచ దేశాల్లో కొత్త చర్చకు దారి తీసింది. హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలు ట్యాక్స్ చెల్లించాలన్న ఇరాన్ ఆదేశాలపై భారత్ వంటి దేశాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ జలాల గుండా వెళ్లే నౌకలపై సుంకాలు వసూల్ చేసే అధికారం ఏ దేశానికి లేదని తేల్చి చెబుతున్నాయి. మరీ ట్రంప్ తాజా ప్రకటనపై ప్రపంచ దేశాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూడాలీ.