ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేస్తుందనే అంచనాల మధ్య, అదే AIపై వ్యతిరేక స్వరాలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో సుమారు 400 మంది నిరసనకారులు AI కంపెనీలైన ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్, గూగుల్ డీప్‌మైండ్ ఆఫీసుల ముందు భారీ ప్రదర్శన నిర్వహించారు. “Stop the AI Race” పేరుతో జరిగిన ఈ నిరసనలో AI అభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయాలని.. కొత్త శక్తివంతమైన AI మోడళ్ల తయారీపై నియంత్రణలు తీసుకురావాలని మితిమీరిన ఏఐ గ్రోత్ ఆపాలంటూ డిమాండ్ చేశారు.
ఈ ఉద్యమం వెనుక ఉన్న ప్రధాన డిమాండ్ ఏంటంటే.. ప్రపంచంలోని అన్ని ప్రముఖ AI సంస్థలు ఒకే సమయంలో సూపర్ AI మోడళ్ల అభివృద్ధిని నిలిపివేతపై ఆయా సంస్థల సీఈఓలు బహిరంగంగా హామీ ఇవ్వాలని నిరసనకారులు కోరుతున్నారు. ఓపెన్‌ఏఐ సామ్ ఆల్ట్‌మన్, ఆంథ్రోపిక్ డారియో అమోడీ వంటి టెక్ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ ఉద్యమం సాగింది. AI అభివృద్ధి ఒక పోటీగా మారటంతో.. వాటివల్ల ప్రభావాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా కంపెనీలు వేగంగా ముందుకు వెళ్తున్నాయని నిరసనకారులు ఆరోపించారు.
I organized the biggest AI Safety protest in US History!
— Michaël Trazzi (@MichaelTrazzi) March 22, 2026
Nearly 200 people marched from Anthropic to OpenAI to xAI with one demand: commit to pausing if the others do too pic.twitter.com/YZt8n740G3
ఉద్యోగాల కోత నుంచి భవిష్యత్ భయం వరకు
AIపై వ్యతిరేకతకు ప్రధాన కారణాల్లో ఉద్యోగాల కోత ఒకటి. ఇప్పటికే టెక్ రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపులు జరుగుతున్నాయి. AI ఆధారిత ఆటోమేషన్ కారణంగా భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న జీవన వ్యయం, అద్దెలు, AI వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలు, నియంత్రణ లేని సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలను కూడా వారు ప్రస్తావించారు. “AI లాభాల కోసం కాదు.. మానవ భద్రత కోసం నియంత్రించాలి” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
On our way to Anthropic! pic.twitter.com/Ndtq9gtinY
— Michaël Trazzi (@MichaelTrazzi) July 11, 2026
మాజీ AI రీసెర్చర్ నేతృత్వంలో ఉద్యమం..
“Stop the AI Race” ఉద్యమానికి మాజీ AI పరిశోధకుడు మైఖేల్ ట్రాజీ నాయకత్వం వహించారు. గతంలో కూడా AI అభివృద్ధిని నిలిపివేయాలని కోరుతూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ప్రస్తుత నిరసనలో కూడా AI అభివృద్ధి ఒక ప్రమాదకరమైన పోటీగా మారిందని, అన్ని కంపెనీలు కలిసి నిర్ణయం తీసుకోకపోతే.. రేసులో పరిగెడుతున్న ఒక్క సంస్థ కూడా వెనక్కి తగ్గదని అన్నారు. AI శక్తి తప్పు చేతుల్లోకి వెళ్తే ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రమాదం ఏర్పడవచ్చని హెచ్చరించారు.
►ALSO READ | రోజుకు 3GB డేటా.. 70 రోజుల వ్యాలిడిటీ! BSNL అదిరిపోయే కొత్త రీఛార్జ్ ప్లాన్...
మరోవైపు AI కంపెనీలు మాత్రం ఈ సాంకేతికతను పూర్తిగా ఆపడం సాధ్యం కాదని, సరైన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీ కూడా AI వల్ల వచ్చే ప్రమాదాలపై గతంలో ఆందోళనలు వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగాల కోతలు, వేగంగా మారుతున్న టెక్ రంగం నేపథ్యంలో ప్రజల్లో AIపై అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా AIపై ప్రశంసలతో పాటు వ్యతిరేకత కూడా పెరుగుతున్న సమయంలో.. శాన్‌ఫ్రాన్సిస్కో నిరసనలు టెక్నాలజీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
