రోజుకు 3GB డేటా.. 70 రోజుల వ్యాలిడిటీ! BSNL అదిరిపోయే కొత్త రీఛార్జ్ ప్లాన్...

రోజుకు 3GB డేటా.. 70 రోజుల వ్యాలిడిటీ! BSNL అదిరిపోయే కొత్త రీఛార్జ్  ప్లాన్...

ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్ ధరల బాదుడుతో విసిగిపోయిన కస్టమర్లకు BSNL ఎప్పుడూ తక్కువ ధరలోనే మంచి ప్లాన్లను అందిస్తూ వస్తోంది. ఎక్కువ రోజుల వాలిడిటీ  కావాలి, డైలీ డేటా ఎక్కువగా ఉండాలి, పైగా ఆన్ లిమిటెడ్ కాలింగ్ కూడా కావాలనుకునే వారి కోసం BSNL ఒక బంపర్ ప్లాన్‌ తీసుకొచ్చింది. అదే రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్.. ఇలా అన్ని అవసరాలూ తీరిపోయే ఈ ఆల్-ఇన్-వన్ ప్లాన్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం....

రూ.599 ప్లాన్‌తో  ప్రయోజనాలు ఇవే:
70 రోజుల వ్యాలిడిటీ: ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే రెండు నెలలకు పైగా, అంటే పూర్తిగా  70 రోజుల వరకు మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.

రోజుకు 3GB హై-స్పీడ్ డేటా: ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవారికి ఇది పండగే. ప్రతిరోజూ 3GB డైలీ హై-స్పీడ్ డేటా వస్తుంది.

డేటా అయిపోయినా ఇంటర్నెట్ ఆగదు: ఒకవేళ మీ డైలీ డేటా 3GB లిమిట్ అయిపోయినా ఇంటర్నెట్ కట్ అవ్వదు. కాకపోతే స్పీడ్ కొద్దిగా తగ్గి 40 Kbpsకి పడిపోతుంది .

ఆన్ లిమిటెడ్ కాలింగ్:  భారతదేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా ఎంతసేపైనా ఉచితంగా మాట్లాడుకోవచ్చు అంటే ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. 

ఉచిత SMS:  ఆన్ లిమిటెడ్ కాలింగ్, డేటాతో పాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు (SMS) కూడా లభిస్తాయి.

ఈ ప్లాన్ ఎవరికి బెస్ట్?
ఆఫీస్ పనుల కోసం లేదా యూట్యూబ్, ఓటీటీల్లో సినిమాలు, రీల్స్ ఎక్కువగా చూస్తూ ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఈ ప్లాన్ చక్కటి ఛాయిస్. ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే తలనొప్పి లేకుండా, కాస్త ఎక్కువ రోజులు వాలిడిటీ వచ్చే ప్లాన్ కావాలనుకునే వారికి రూ.599 ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.

►ALSO READ | ఇంటర్నెట్ అవసరం లేనివారికి ట్రాయ్ బంపర్ ఆఫర్.. కొత్త రీఛార్జ్ రూల్స్ ఇవే

టెలికాం కంపెనీలు ప్లాన్ల ధరలను, ఆఫర్లను అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు రీఛార్జ్ చేసుకునే ముందు ఒకసారి BSNL అధికారిక వెబ్‌సైట్ లేదా  'సెల్ఫ్‌కేర్' (BSNL Selfcare) యాప్‌లో మీ నంబర్‌కు ఈ ప్లాన్ అందుబాటులో ఉందో లేదో చెక్  చేసుకోవడం మంచిది. మీ ప్రాంతంలో BSNL సిగ్నల్స్  ఉంటే, ఈ ప్లాన్ మీకు ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది!