ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఇన్వెస్టర్లకు కన్నీళ్లను మిగిల్చాయి. ఇంట్రాడే హై నుంచి ఏకంగా సెన్సెక్స్ సూచీ 950 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్స్ క్లోజింగ్ నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 547 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 157 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 339 పాయింట్లను కోల్పోయాయి. ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 47 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రాయాణాన్ని ముగించింది. కొత్త వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల పతనానికి కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. లాభాల బుక్కింగ్:
మార్కెట్లు వరుసగా 2 రోజుల పాటు లాభాల్లో ముగిసిన తర్వాత.. గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ వైపు మొగ్గుచూపారు. దీంతో ఒక్కసారిగా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగి సూచీలు బలహీనపడ్డాయి.
2. రిజర్వ్ బ్యాంక్ చర్యలు:
రూపాయి మారకం విలువ క్షీణతను అరికట్టడానికి, సిస్టమ్‌లో అదనపు లిక్విడిటీని నియంత్రించడానికి ఆర్బీఐ తీసుకున్న పలు చర్యలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల కోసం ప్రత్యేక డాలర్ విండో ఏర్పాటు చేయడం, బాండ్ల విక్రయం, అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో పెంపు వంటి నిర్ణయాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి.
►ALSO READ | రిక్రూట్మెంట్‌పై TCS సంచలన నిర్ణయం.. వారికే ఫస్ట్ ప్రయారిటీ!
3. టెక్నికల్ కారణాలు:
మార్కెట్లలో మళ్లీ బుల్లిష్ ట్రెండ్ రావాలంటే నిఫ్టీ 22,650 స్థాయిపైన ట్రేడ్ కావాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది కేవలం ఒక రికవరీ ర్యాలీలాగే కనిపిస్తోందని, బలమైన స్థూల ఆర్థికాంశాలు తోడైతేనే సుస్థిరమైన పురోగతి సాధ్యమని అభిప్రాయపడ్డారు.
4. పెరుగుతున్న ఇండియా విక్స్:
మార్కెట్లలో స్వల్పకాలిక అస్థిరతను సూచించే ఇండియా విక్స్ ఏకంగా 7.5 శాతం మేర పెరగడం ట్రేడర్లలో ఆందోళనను కలిగించింది.
5. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు:
FIIలు వరుసగా 11వ సెషన్‌లోనూ అమ్మకాలను కొనసాగించారు. విదేశీ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరిస్తుండగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం కొనుగోళ్లతో మార్కెట్‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
