Allu Arjun: AA23 అప్డేట్ వచ్చేసింది.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు లోకేశ్ కనగరాజ్ గుడ్ న్యూస్

Allu Arjun: AA23 అప్డేట్ వచ్చేసింది.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు లోకేశ్ కనగరాజ్ గుడ్ న్యూస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న AA23 సినిమాపై మళ్లీ ఆసక్తి పెరిగింది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరిగిన నేపథ్యంలో.. తాజాగా లోకేశ్ కనగరాజ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అల్లు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ‘త్వరలోనే ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌లు వస్తాయని’ అంటూ లోకేష్ చేసిన పోస్ట్‌తో ఈ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటనలు త్వరలోనే వచ్చే అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి.

అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ కథా చర్చల్లో పాల్గొంటున్న ఫొటోను దర్శకుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో AA23 భవిష్యత్తుపై నెలకొన్న సందేహాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ పోస్ట్‌లో తదుపరి అప్‌డేట్ ఏమిటనేది వెల్లడించలేదు. టైటిల్ ప్రకటిస్తారా? అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తారా? షూటింగ్‌కు సంబంధించిన వివరాలు చెబుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పుకార్లకు చెక్ పడినట్టేనా?

అల్లు అర్జున్–లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే AA23పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఫస్ట్ వీడియో తర్వాత ఎలాంటి కీలక అప్‌డేట్ రాకపోవడంతో సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ చేసిన తాజా పోస్ట్ బన్నీ ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపింది. అల్లు అర్జున్‌తో కలిసి చర్చిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ త్వరలోనే వస్తాయని’ చెప్పడంతో AA23 మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రైటర్ రత్నకుమార్ పోస్ట్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు స్వయంగా దర్శకుడే అప్‌డేట్ ఇవ్వడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

మరి త్వరలో టైటిల్ రివీల్ ఉంటుందా? బన్నీ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ బయటకు వస్తుందా? లేక షూటింగ్‌పై కీలక ప్రకటన ఉంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, AA23పై త్వరలోనే మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉందన్న సంకేతంతో బన్నీ ఫ్యాన్స్ ఇప్పుడు నెక్స్ట్ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AA23.. అనౌన్స్‌మెంట్‌తోనే భారీ హైప్!

2026 జనవరిలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించిన అల్లు అర్జున్–లోకేశ్ కనగరాజ్ కాంబో అప్పట్లోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. అనిరుధ్ అందించిన ‘23’ థీమ్, సింహం–నక్కల విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. కథపై ఎలాంటి క్లూ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. బన్నీ కెరీర్‌లో 23వ సినిమా కావడంతో AA23 అని, లోకేశ్ దర్శకత్వంలో ఏడో సినిమా కావడంతో LK7 అని ఈ ప్రాజెక్ట్‌ను పిలుస్తున్నారు. ఇప్పుడు లోకేశ్ తాజా పోస్ట్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది.

►ALSO READ | Pawan Kalyan : 'నీ ప్రయాణం తిరుగులేనిది'.. పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానంపై అల్లు అరవింద్ ఎమోషనల్ నోట్!

కథా నేపథ్యం ఏంటి? యాక్షనా.. సైన్స్ ఫిక్షనా?

AA23 కథపై ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు. అయితే అనౌన్స్‌మెంట్ వీడియోలోని సింహం, నక్కల విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. లోకేశ్ కనగరాజ్ గత చిత్రాల తరహాలో క్రైమ్, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఉంటుందా? లేక సైన్స్ ఫిక్షన్, సూపర్‌హీరో అంశాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారా? అన్న చర్చ నడుస్తోంది. బన్నీ ఇమేజ్‌కు లోకేశ్ మార్క్ యాక్షన్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయితే కథా నేపథ్యంపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

అల్లు అర్జున్ మేకోవర్.. AA23లో బన్నీ మరో లెవల్‌లో ఉంటారా?

‘ఆర్య’ నుంచి ‘పుష్ప’ వరకు ప్రతి సినిమాలోనూ తన లుక్, బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు AA23 కోసం మరో కొత్త అవతారంలో కనిపించనున్నారనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. ఫిల్మ్‌ఫేర్ కథనం ప్రకారం, లోకేశ్ పాత్రకు తగ్గట్టుగా విభిన్నమైన లుక్స్‌పై పరిశీలన జరిగినట్లు సమాచారం. అయితే బన్నీ ఫైనల్ మేకోవర్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

పుష్పరాజ్‌గా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఐకాన్ స్టార్.. ఈసారి లోకేశ్ మార్క్ యాక్షన్ వరల్డ్‌లో ఎలాంటి లుక్‌తో కనిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బన్నీ కొత్త గెటప్ ఎలా ఉండబోతోంది? మరోసారి తన స్టైల్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారా? అన్నది తెలియాలంటే అధికారిక అప్‌డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే!

లోకేశ్ కనరాజ్ దర్శకత్వం.. అల్లు అర్జున్‌తో కొత్త ప్రయోగం!

తమిళంలో ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’, ‘కూలీ’ వంటి చిత్రాలతో తనదైన యాక్షన్ మార్క్‌ను క్రియేట్ చేసిన లోకేశ్ కనగరాజ్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్‌తో ఆయన సినిమా చేయనుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బన్నీ మాస్ ఇమేజ్, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు లోకేశ్ టేకింగ్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు నమోదవుతాయన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌ (LCU)లో భాగమవుతుందా? గత చిత్రాల పాత్రలకు ఇందులో చోటుంటుందా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

అనిరుధ్ మ్యూజిక్.. ‘23’ థీమ్‌తోనే రచ్చ!

AA23కు మరో ప్రధాన ఆకర్షణ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. లోకేశ్ కనగరాజ్‌తో ఇప్పటికే పలు హిట్ సినిమాలకు పనిచేసిన ఆయన.. ఇప్పుడు తొలిసారి అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయనున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలోని ‘23’ థీమ్ ఇప్పటికే అభిమానుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ థీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ రీల్స్ మైలురాయిని దాటినట్లు వార్తలు రావడంతో ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరిగింది. బన్నీ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు అనిరుధ్ పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలవ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయితే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో..

AA23ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇదే సంస్థ అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ చిత్రాలకు పనిచేసింది. ఆ కాంబినేషన్‌కు ఉన్న విజయవంతమైన నేపథ్యం కూడా ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది. అధికారిక ప్రకటన సమయంలోనే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశాన్ని మేకర్స్ వెల్లడించారు. అయితే తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలు, బడ్జెట్, ఇతర తారాగణం, సాంకేతిక బృందం, విడుదల తేదీ వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

షూటింగ్ ఎప్పుడంటే? AA23పై నెక్స్ట్ అప్‌డేట్ కోసం వెయిటింగ్!

AA23 షూటింగ్ 2026లో ప్రారంభమవుతుందని తొలుత మేకర్స్ ప్రకటించినప్పటికీ.. ఇప్పటివరకు తాజా అధికారిక షెడ్యూల్‌పై స్పష్టత రాలేదు. మరోవైపు అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో లోకేశ్ కనగరాజ్ చేసిన ‘Interesting updates coming soon’ పోస్ట్‌తో AA23పై మళ్లీ హైప్ పెరిగింది. త్వరలో టైటిల్ రివీల్ చేస్తారా? బన్నీ ఫస్ట్ లుక్ విడుదల చేస్తారా? లేక షూటింగ్‌పై కీలక ప్రకటన ఉంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. బన్నీ స్టార్‌డమ్, లోకేశ్ యాక్షన్ టేకింగ్, అనిరుధ్ మ్యూజిక్ కలయికలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నెక్స్ట్ అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.