బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) వద్ద ఉన్న ఓ ఫుడ్ అండ్ బెవరేజ్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 26 ఏళ్ల యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
సమాచారం ప్రకారం.. ఏం జరిగిందంటే.. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి ఫుడ్ అండ్ బెవరేజ్ కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్ తనను వేధించడం ప్రారంభించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. తన మొబైల్ ఫోన్‌ను లాక్కుని అందులోని వివరాలు చెక్ చేయడంతో పాటు, వేరే వాళ్లతో మాట్లాడకుండా అడ్డుకున్నాడు. అంతేకాకుండా, తన ఛాతీపై ఉన్న టాటూ (పచ్చబొట్టు) చూపించమని బలవంతం చేశాడని బాధితురాలు ఆరోపించింది.
►ALSO READ | పెళ్లై 19 ఏళ్లు.. పిల్లలు కలగలేదని విడాకులు కోరిన భర్త: కోర్టు కీలక తీర్పు
అలాగే సెప్టెంబర్ 30న నిందితుడు బాధితురాలిని ఒక గదిలోకి పిలిచి, తన బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తించాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె బట్టలు విప్పాలని బలవంతం చేశాడంటూ బాధితురాలు తీవ్రమైన ఆరోపణలు చేసింది.
పోలీసుల చర్య:
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. పోలీసులు నిందితుడికి నోటీసులు జారీ చేసి, అతడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు అధికారులు తెలిపారు.
