దేశమంతా ఏకమవ్వాలి: చలో సుప్రీంకోర్టు ర్యాలీలో రాహుల్ గాంధీ

దేశమంతా ఏకమవ్వాలి: చలో సుప్రీంకోర్టు ర్యాలీలో  రాహుల్ గాంధీ

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) అక్రమాలపై పోరులో దేశం అంతా ఏకం అవ్వాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఉద్యమానికి, విపక్షాలు ప్రజసంఘాలు కలిసిరావాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి చేతులు కలపాల్సిన అవసరం ఉందన్నారు. 2026 అక్టోబర్ 12న ఇండియా కూటమి తలపెట్టిన మార్చ్ ఫర్ డెమొక్రసీ ర్యాలీ ప్రారంభించిన  సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత పోరాటాలను కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. సీఈసీ రిజైన్ కోసం కాంగ్రెస్ పోరు బాటకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. 

ఓట్ల చోరీ, సర్ అభ్యంతరాలతో ఇండియా కూటమి తలపెట్టిన మార్చ్ ఫర్ డెమొక్రసీ  ర్యాలీ ప్రారంభమైంది. ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతం నుంచి ర్యాలీ ప్రారంభించారు. కన్నాట్ నుంచి బారాబంకా రోడ్ మీదుగా శాంతియుత నిరసన ప్రదర్శన చేస్తూ ర్యాలీగా విపక్షాలు సుప్రీంకోర్టు దిశగా వెళ్తున్నాయి. 

మార్చ్ ఫర్ డెమొక్రసో ర్యాలీతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. కీలక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కన్నాట్ ప్లేస్ లో పారామిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. మండిహౌస్ దగ్గర బారాబంకీ రోడ్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. RAF, CRPF  పారామిలిటరీ బలగాలతో భద్రత చర్యలు తీసుకుంటున్నారు.