సినీ నటుడు బాలకృష్ణ తన ఇంటి స్థలాన్ని పరిహారం తీసుకోకుండానే ఇచ్చేశారనే వార్త మీడియాలో, సోషల్ మీడియాలో హైలైట్ అయింది. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల కోసం జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని తన 862.77 చదరపు గజాల విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించేందుకు ఆయన అంగీకరించారు.
భూమి ఇచ్చినందుకు ప్రభుత్వం నుంచి నగదు రూపంలో ఎలాంటి నష్టపరిహారం తీసుకోలేదు. కేవలం టీడీఆర్ (ట్రాన్స్ఫరేబుల్ డెవలప్మెంట్ రైట్స్) సర్టిఫికెట్ తీసుకునేందుకు ఒప్పుకున్నారు. అయితే.. టీడీఆర్ తీసుకోవడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఎలాంటి పరిహారం తీసుకోకుండా బాలకృష్ణ స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ టీడీఆర్ వల్ల లాభపడే అంశాలే ఎక్కువగా ఉన్నాయి.
►ALSO READ | చెరువులు, నాలాల అభివృద్ధిలో భూ బాధితులకు టీడీఆర్.. 200 నుంచి 400 శాతం ఇవ్వనున్న సర్కారు
ఎవరైనా ఒక నిర్వాసితుడు రోడ్ల విస్తరణ వల్ల ఆస్తులను కోల్పోయినప్పుడు అంతకు నాలుగు రెట్లు.. నాలాలు, వాటర్ బాడీస్లో కోల్పొతే రెండు రెట్ల ఎక్కువకు టీడీఆర్ పత్రాలను పరిహారంగా అందజేస్తారు. టీడీఆర్ ఉంటే 750 నుంచి 2,000 చదరపు మీటర్ల ప్లాటులో 21 మీటర్ల ఎత్తు (జీ+6 అంతస్తులు) వరకు నిర్మించుకోవచ్చు. 2,000 చ.మీ. కంటే ఎక్కువ స్థలం ఉండి, రోడ్డు వెడల్పు 40 అడుగుల కంటే ఎక్కువ ఉంటే, జీ+5 అంతస్తులకు అదనంగా మరో 3 ఫ్లోర్లు కట్టుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
►ALSO READ | టీడీఆర్కు మరింత డిమాండ్.. ఇప్పటికే 50 నుంచి 60 శాతం అదనపు ధర
రోడ్డు వెడల్పు 60 అడుగులుంటే అదనంగా 4 అంతస్తులు, 80 అడుగులుంటే 5 అదనపు ఫ్లోర్ల నిర్మాణానికి అనుమతి లభిస్తుంది. అలాగే, సెట్ బ్యాక్కి సంబంధించి కూడా టీడీఆర్ తో 10 శాతం మినహాయింపు కల్పించింది.10 నుంచి 20 అంతస్తులు కట్టుకుంటే టీడీఆర్తో 3 శాతం వరకు అదనపు బిల్ట్- అప్ ఏరియా పెంచుకోవచ్చు. సో.. ఈ విధంగా చూసుకుంటే స్థలం ఇచ్చినందుకు బాలకృష్ణ భారీగా నష్టపోవడం లేదా ఉచితంగా స్థలం ఇవ్వడం లాంటివేం జరగలేదు. టీడీఆర్ సర్టిఫికెట్ తీసుకోవడం అంటే లాభపడటమే తప్ప నష్టపోవడం ఏం కాదు.
►ALSO READ | డబ్బుల కంటే టీడీఆర్ బెటర్..ఆస్తులు కోల్పోతున్న వారికి కమిషనర్ కర్ణన్ సలహా
