డబ్బుల కంటే టీడీఆర్ బెటర్..ఆస్తులు కోల్పోతున్న వారికి కమిషనర్ కర్ణన్ సలహా

డబ్బుల కంటే టీడీఆర్ బెటర్..ఆస్తులు కోల్పోతున్న వారికి కమిషనర్ కర్ణన్ సలహా

హైదరాబాద్ సిటీ, వెలుగు: కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్న ప్రధాన జంక్షన్ల విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారు నగదు పరిహారం కంటే టీడీఆర్ సర్టిఫికెట్ పొందడం ద్వారా లాభపడతారని, యజమానులు దీనిని ఎంచుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్​కర్ణన్​సలహా ఇచ్చారు. జూబ్లీహిల్స్ చెక్​పోస్ట్, కేబీఆర్ ఎంట్రెన్స్, ముగ్ధ జంక్షన్​తో పాటు మిగతా జంక్షన్లలో ఆస్తులు కోల్పేయే  యజమానులతో మంగళవారం బంజారాభవన్ లో సమావేశం నిర్వహించారు.

పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో సమస్య లేకుండా చేసేందుకు రోడ్ల విస్తరణ చేపట్టినట్టు చెప్పారు. రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయే యజమానులకు ప్రభుత్వం ఇచ్చే ట్రాన్స్ ఫరేబుల్ డెవలప్ మెంట్ రైట్స్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పారు. ఆస్తులు కోల్పోయే వారి టీడీఆర్ దరఖాస్తులను పరిశీలించి, ఇబ్బందులు లేకుండా సర్టిఫికెట్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.