ఉక్క పోస్తుందని ఏసీ గదిలో పండుకున్నరు.. తెల్లారే లోపు ఫ్యామిలీ మొత్తం సచ్చిపోయింది !

ఉక్క పోస్తుందని ఏసీ గదిలో పండుకున్నరు.. తెల్లారే లోపు ఫ్యామిలీ మొత్తం సచ్చిపోయింది !

ప్రతాప్గఢ్: ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ పరిధిలో విషాద ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలి ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. నగర్ కోత్వాలి ప్రాంతంలోని మహూలి కాలనీలో ఈ ఘటన జరిగింది.

దాదాపు వందేళ్ల నాటి ఇల్లు భారీ వర్షాలకు కూలిపోవడంతో ఈ ఘటన జరిగింది. వర్షాలు పడినప్పటికీ.. ఉదయం తీవ్రమైన వేడి, ఉక్కపోత కారణంగా ఆ కుటుంబం ఏసీ గదిలో నిద్రపోవాలని డిసైడ్ అయి వెళ్లి పడుకున్నారు. రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి పైకప్పు కూలిపోయి, ఆ కుటుంబం శిథిలాల కింద చిక్కుకుంది.

ప్రతాప్‌గఢ్ జిల్లా కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహూలీ బజార్‌లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 100 ఏళ్ల నాటి పాత ఇల్లు కూలడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఇంట్లో శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమోద్ శ్రీవాస్తవ (60), అతని భార్య రీటా (55), వారి కొడుకు నితిన్ (25), కోడలు మాధురి (24), పెద్ద కొడుకు అమన్ (28) ఇద్దరు కొడుకులు చనిపోయారు.

శిథిలా కింద నుంచి పాకుతూ బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారిని అమన్ అప్రమత్తం చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అప్పటికే అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.