ప్రేమకు తండ్రి అడ్డుపడుతున్నాడని పోలీస్ స్టేషన్కు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కొడుకు !

ప్రేమకు తండ్రి అడ్డుపడుతున్నాడని పోలీస్ స్టేషన్కు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కొడుకు !

హైదరాబాద్: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌పై ఆయన కొడుకు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని అన్నారు. ఈ క్రమంలోనే.. తనకు కాబోయే భార్య ఇంటిపై తన తండ్రి అనుచరులతో దాడి చేయించి, తమను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఏ క్షణమైనా తన ప్రాణానికి ప్రమాదం ఉందని, తనకు, తన కాబోయే భార్య కుటుంబానికి తక్షణ రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ అంశంపై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యేపై ఆయన కొడుకు చేసిన ఆరోపణలు రాజేంద్రనగర్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

అయితే, ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.