విజయవాడ: ఏపీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో 17 నగర పాలక సంస్థలు, 106 మున్సిపాలిటీలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 106 పురపాలక సంఘాల్లో బీసీలకు 35, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3, 50 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు.
గూడురు మున్సిపాలిటీ ఎస్టీ మహిళకు.. కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, చింతలపూడి, సూళ్లూరుపేట, గుత్తి, చీరాల పురపాలక సంఘాలను ఎస్సీ మహిళలకు కేటాయిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, నాయుడుపేట,చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, కొవ్వూరు, పాలకొల్లు, గుంతకల్లు, గుడివాడ, నందిగామ, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం పురపాలక సంఘాలను బీసీ మహిళలకు కేటాయించారు.
కనిగిరి, వెంకటగిరి, నరసాపురం, పలాస-కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పాలకొండ, పొన్నూరు, భీమవరం, జగ్గయ్యపేట, బుచ్చిరెడ్డిపాళెం, ఎర్రగుంట్ల, యలమంచిలి, కల్యాణదుర్గం, ఆమదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలను జనరల్ మహిళ కోటాలో రిజర్వేషన్ కల్పించారు.
కావలి, కదిరి, బి.కొత్తకోట, కందుకూరు, హిందూపురం, ఆత్మకూరు (నెల్లూరు), అద్దంకి, కమలాపురం, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరు, దర్శి, గూడూరు (కర్నూలు), మైదుకూరు, బద్వేలు పురపాలకు సంఘాలను బీసీ - జనరల్‌కు కేటాయించారు.
ఆత్మకూరు, ఆలూరు పురపాలక సంఘాలను ఎస్టీ జనరల్కు కేటాయించారు. పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి, సాలూరు, తణుకు, తెనాలి, తాడేపల్లిగూడెం, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తుని, పార్వతీపురం, ప్రొద్దుటూరు, పుత్తూరు, మండపేట, నగరి, చీమకుర్తి, తిరువూరు, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, పెద్దాపురం, ధర్మవరం, తాడిగడప, పిడుగురాళ్ల, తాడిపత్రి పురపాలక సంఘాలను అన్ రిజర్వ్‌డ్‌గా ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది.
* పురపాలక సంఘాలు : 106
* ఎస్టీ-మహిళ: గూడూరు
* ఎస్టీ - జనరల్: ఆత్మకూరు, ఆలూరు
* ఎస్సీ- మహిళలు: కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, చింతలపూడి, సూళ్లూరుపేట, గుత్తి, చీరాల
* ఎస్సీ - జనరల్: ఉయ్యూరు, నూజివీడు, కుప్పం, సామర్లకోట, పిఠాపురం, బాపట్ల, పొదిలి
* బీసీ- మహిళ:
జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, నాయుడుపేట,చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, కొవ్వూరు, పాలకొల్లు, గుంతకల్లు, గుడివాడ, నందిగామ, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం
* బీసీ-జనరల్:
కావలి, కదిరి, బి.కొత్తకోట, కందుకూరు, హిందూపురం, ఆత్మకూరు (నెల్లూరు), అద్దంకి, కమలాపురం, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరు, దర్శి, గూడూరు (కర్నూలు), మైదుకూరు, బద్వేలు
* జనరల్ - మహిళ:
కనిగిరి, వెంకటగిరి, నరసాపురం, పలాస-కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పాలకొండ, పొన్నూరు, భీమవరం, జగ్గయ్యపేట, బుచ్చిరెడ్డిపాళెం, ఎర్రగుంట్ల, యలమంచిలి, కల్యాణదుర్గం, ఆమదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు
* అన్ రిజర్వ్‌డ్:
పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి, సాలూరు, తణుకు, తెనాలి, తాడేపల్లిగూడెం, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తుని, పార్వతీపురం, ప్రొద్దుటూరు, పుత్తూరు, మండపేట, నగరి, చీమకుర్తి, తిరువూరు, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, పెద్దాపురం, ధర్మవరం, తాడిగడప, పిడుగురాళ్ల, తాడిపత్రి.
