'లెనిన్' మూవీపై చిరంజీవి ట్వీట్‌కు అఖిల్ ఎమోషనల్ రిప్లై.. 'పెదనాన్న' అంటూ పోస్ట్ !

'లెనిన్' మూవీపై చిరంజీవి ట్వీట్‌కు అఖిల్ ఎమోషనల్ రిప్లై.. 'పెదనాన్న' అంటూ పోస్ట్ !

ఎంతో కాలంగా ఒక సాలిడ్ హీట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు అఖిల్ కు ఎట్టకేలకు ' లెనిన్ ' రూపంలో ఒక తిరుగులేని బ్లాక్ బస్టర్ లభించింద. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ రూరల్ రివెంజ్ డ్రామా.. జూలై 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఊహించని విధంగా కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 61.1 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. 

మెగాస్టార్ ట్వీట్.. 

ఈ భారీ విజయంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'లెనిన్' గురించి అద్భుతమైన స్పందన వింటున్నా.. ముఖ్యంగా అఖిల్ నటనకు వస్తోన్న ప్రశంసలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అఖిల్ నాకు మరో కొడుకుతో సమానం. నా స్నేహితుడు నాగార్జునకు, చిత్రబృందానికి అభినందనలు. త్వరలోనే సినిమా చూస్తాను అని ఎక్స్  వేదికగా ప్రశంసలు కురిపించారు.

'పెదనాన్న' అంటూ అఖిల్ రిప్లై..

దీనికి నాగార్జున కృతజ్ఞతలు తెలపగా.. అఖిల్ స్పందిస్తూ.. 'పెదనాన్న మీ ప్రేమ ఎప్పుడూ అమితమైంది. మీ సహకారానికి ధన్యవాదాలు' అంటూ రిప్లై ఇచ్చారు. మెగా-అక్కినేని కుటుంబాల మధ్య ఉన్న ఈ అప్యాయత, 'పెదనాన్న' అనే పిలుపు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఇరు కుటుంబాల అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది.

రామ్ చరణ్ సినిమా 'పెద్ది' కోసం అఖిల్ తన 'లెనిన్' విడుదలను కాస్త వెనక్కి జరిపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ చూపించిన ఇంటెన్సిటీ, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి. అటు గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌ను కట్టిపడేసింది. ప్రమోద్ పంజు, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరీ రావు తమ నటనతో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. 

►ALSO READ | శేఖర్ మాస్టర్ తో గొడవే లేదు.. చిరంజీవితో కలిసి లంచ్ చేసామంటూ జానీ మాస్టర్ క్లారిటీ!

ఈ మూవీ విడుదలైన తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అటు థియేటర్లలో టిక్కెట్ల ధరలు పెంచకపోవడం, వీకెండ్ అడ్వాంటేజ్ తోడవడంతో మూడో రోజు వసూళ్లు మొదటి రెండు రోజుల రికార్డులను బ్రేక్ చేశాయి. ఇదే జోరు కొనసాగితే అఖిల్ తొలిసారి రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోందని అటు ఫ్యాన్స్, సినీవర్గాలు అంచనా వేస్తున్నారు.