నిర్మల్ జిల్లాలో విషాదం..ఉరేసుకుని మహిళా సర్పంచ్ ఆత్మహత్య

నిర్మల్ జిల్లాలో విషాదం..ఉరేసుకుని మహిళా సర్పంచ్ ఆత్మహత్య

నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తానూరు మండలం బోరిగాం గ్రామ సర్పంచి పల్లె జ్యోతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామ సర్పంచ్ గా  ఉన్న జ్యోతి.. హఠాత్తుగా ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ కలహాలా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.