బీఆర్ఎస్‌‌ అవినీతిలో కవితకూ భాగస్వామ్యం ఉంది : జనసేన జనరల్ సెక్రటరీ రాం తాళ్లూరి

బీఆర్ఎస్‌‌ అవినీతిలో కవితకూ భాగస్వామ్యం ఉంది :  జనసేన జనరల్ సెక్రటరీ  రాం తాళ్లూరి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బీఆర్ఎస్​హయాంలో చేసిన పాపాలను కడిగేసుకొని కవిత పొలిటికల్‌‌గా ఎంట్రీ ఇవ్వాలని జనసేన జనరల్ సెక్రటరీ రాం తాళ్లూరి పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని మాజీ హెల్త్​ డైరెక్టర్​ గడల శ్రీనివాస్‌‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాం తాళ్లూరి మాట్లాడుతూ కేసీఆర్​హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కవిత పేర్కొంటున్నారని, ఆ అవినీతిలో ఆమెకూ భాగస్వామ్యం ఉందన్నారు. 

ఇప్పుడేమో టీఆర్ఎస్​పేర కవిత ఆ అవినీతి మురికి అంటించుకుంటున్నారని విమర్శించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానానికి జనసేన నుంచి గడల శ్రీనివాస్, తాను ఖమ్మం పార్లమెంట్‌‌కు పోటీ చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు శంకర్‌‌‌‌గౌడ్‌‌, ఆర్‌‌‌‌కే సాగర్​, సుధాకర్, సతీశ్‌‌రెడ్డి, నరేశ్‌‌రెడ్డి, హసీనా, రవీందర్​, లిఖిత, శ్రీనివాస్​ పాల్గొన్నారు.