మావోయిస్టుల డంప్ స్వాధీనం..బంగారం, నగదుతో పాటు ఆయుధాలు గుర్తింపు

మావోయిస్టుల డంప్ స్వాధీనం..బంగారం, నగదుతో పాటు ఆయుధాలు గుర్తింపు

భద్రాచలం, వెలుగు : మావోయిస్టులకు చెందిన డంప్ ను ఛత్తీస్​గఢ్​రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఆదివారం భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎస్పీ గౌరవ్​రాయ్​తెలిపిన వివరాల ప్రకారం... దంతెవాడ జిల్లాలోని బార్సూర్​పోలీస్​స్టేషన్​ పరిధిలో తోడ్మా గ్రామ అడవుల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు గుట్టల్లో దాచిన డంప్​ను గుర్తించారు.

116 గ్రాముల బంగారం, రూ. 2 లక్షలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పాటు 12 బోర్ తుపాకులు 5, తూటాలు, బీజీఎల్​ లాంచర్లు 3, బీజీఎల్​సెల్స్, కార్బన్​మేగజైన్లు 2, 303 రౌండ్లు, 303 చార్జర్లు, టిఫిన్​బాక్స్ బాంబులు 6, పైపు బాంబులు 4, బాణం బాంబులు 22, దేశీ గ్రైనేడ్లు 2, దేశీ మోర్టార్లు 2, డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్, 14 కుక్కర్​బాంబులు, ఇన్సాస్​ రైఫిల్స్, మేగజైన్లు, ఏకే -47 మేగజైన్లు, ఎస్​ఎల్ఆర్​మేగజైన్లు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని దంతెవాడకు 
తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు.