భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టూ టౌన్ పీఎస్ పరిధిలో నాలుగు రోజుల కింద జరిగిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... కొత్తగూడెం టూ టౌన్పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న 17 ఏండ్ల బాలికకు అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది.
ఆటో డ్రైవర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కింద బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులైన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లతో కలిసి బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
