ఖిలా వరంగల్: తప్పుల్లేని ఓటరు జాబితా లక్ష్యం

 ఖిలా వరంగల్: తప్పుల్లేని ఓటరు జాబితా లక్ష్యం

కాశీబుగ్గ/ ఖిలా వరంగల్​(మామునూరు), వెలుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా ఆఫీసర్లు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్య శారద సూచించారు. వరంగల్ తూర్పు నియోజక వర్గం పరిధిలోని కొత్తవాడ,రామన్నపేట, బ్యాంక్ కాలనీ, ఖిలా వరంగల్ లోని శంభునిపేట, పడమర కోటలో నిర్వహిస్తున్న ఎస్‌‌ఐఆర్ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. 

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి బీఎల్వోల పనితీరును పరిశీలించి, ఓటర్ల నుంచి దరఖాస్తులను నిబంధనల ప్రకారం స్వీకరించాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరి వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, డీబీసీడీవో పుష్పలత, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.