దసరా నుంచి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఓపీ సేవలు..హైదరాబాద్‍ నిమ్స్ తరహాలో అత్యుత్తమ ట్రీట్‍మెంట్‍

దసరా నుంచి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఓపీ సేవలు..హైదరాబాద్‍ నిమ్స్ తరహాలో అత్యుత్తమ ట్రీట్‍మెంట్‍
  • డిసెంబర్‍ 15 నాటికి పనులన్నీ పూర్తి చేయాలి 
  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి

 వరంగల్‍, వెలుగు : వరంగల్​లో అత్యాధునాతనంగా నిర్మించిన  మల్టీ సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్ సాఫ్ట్​ లాంచ్​చేస్తామని, ఆరోజు నుంచి అవుట్​ పేషెంట్(ఓపీ)​ సేవలు ప్రారంభమవుతాయని  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి తెలిపారు. గురువారం  మంత్రి ధనసరి సీతక్క, ఎంపీ వేం నరేందర్‍రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్‍.నాగరాజు, రేవూరి ప్రకాశ్‍రెడ్డితో కలిసి ఆయన హాస్పిటల్‍ ను సందర్శించారు. 

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ వరంగల్‍ సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్​లో హైదరాబాద్‍ నిమ్స్​ తరహాలో అత్యుత్తమ ట్రీట్‍మెంట్‍ అందించనున్నట్లు తెలిపారు. ఎంజీఎం హాస్పిటల్​లో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ముందుగా ఈనెల 20న మొదటి 2 అంతస్తుల్లో ఈ ఓపీ సేవలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గత బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం మొండి గోడలతో వదిలేసిన సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ను తమ ప్రభుత్వం  యుద్ధప్రాతిపాదికన పూర్తిచేసిందన్నారు. 

ఎంజీఎంలో  3 వేల వరకు ఉన్న ఓపీ సంఖ్య  సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ ప్రారంభం తర్వాత  5 వేలకు పెరిగే అవకాశముందన్నారు.  డిసెంబర్‍ 15 నాటికి హాస్పిటల్​లో పనులన్నీ  పూర్తి చేయాలని ఆదేశించారు.  కార్యక్రమంలో కుడా చైర్‍పర్సన్‍ గుండు సుధారాణి, వరంగల్‍, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్‍ సత్యశారద, చాహత్‍ బాజ్‍పాయ్‍ పాల్గొన్నారు.