కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ప్యాక్డ్ రైడ్.. యూత్‌ను టార్గెట్ చేసిన MRP మూవీ

కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ప్యాక్డ్ రైడ్.. యూత్‌ను టార్గెట్ చేసిన MRP మూవీ

నరేష్ అగస్త్య, డోనల్ బిష్ట్ జంటగా శ్రవణ్ జేష్ఠ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఎంఆర్‌‌‌‌‌‌‌‌పీ : నీకెంత నాకెంత’.  జులై 17న సినిమా విడుదల  కానుంది. తాజాగా ప్రీ  రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా   నరేష్ అగస్త్య మాట్లాడుతూ ‘ఇదొక యూత్‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్.  కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌‌‌‌తో కూడిన వినోదాత్మక చిత్రంగా అందర్నీ  అలరిస్తుంది’ అని చెప్పాడు.

ఈ చిత్రంలో నటించడం ఎంతో సంతోషంగా ఉందని  హీరోయిన్ డోనల్ బిష్ట్ చెప్పింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుందని   దర్శక నిర్మాత శ్రవణ్ జేష్ఠ అన్నారు.  వెన్నెల కిషోర్, సుదర్శన్, కసిరెడ్డి రాజ్‌‌‌‌కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహా సింగ్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అజయ్ అరసాడ సంగీతం అందించాడు.