నిద్రపోతుండగా కాటేసిన పాము.. కూతురు మృతి, తల్లి పరిస్థితి విషమం

 నిద్రపోతుండగా  కాటేసిన పాము.. కూతురు మృతి, తల్లి పరిస్థితి విషమం

మెదక్ జిల్లాలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. చిన్న శంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో నిద్రలోనే ఓ చిన్నారి ప్రాణాలు విడిచింది. జులై 12న ఆదివారం రాత్రి ఇంట్లో తల్లి, కూతురు ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో కాలనాగు రూపంలో మృత్యువు పడగవిప్పింది. 

నిద్రలో ఉన్న వారిద్దరినీ పాము కాటేసింది. ఈ ప్రమాదంలో కూతురు హారిక అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లి లావణ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం లావణ్య ఆస్పత్రిలో మరణంతో పోరాడుతోంది, ఆమెకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఒకే ఇంట్లో తల్లి కూతుళ్లను పాము కాటేయడం, చిన్నారి మృతి చెందడంతో మల్లుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.