తాత మనవళ్ల బ్యాంక్ అకౌంట్లలో 15 వందల కోట్లు : వీళ్లేమో పెన్షన్ పై బతికేటోళ్లు.. మిస్టరీ ఏంటీ..?

 తాత మనవళ్ల బ్యాంక్ అకౌంట్లలో 15 వందల కోట్లు : వీళ్లేమో పెన్షన్ పై బతికేటోళ్లు.. మిస్టరీ ఏంటీ..?

వాళ్లు నిరుపేదలు.. ప్రతినెలా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులతోనే నెట్టుకొస్తున్నారు జీవితాలను.. అలాంటోళ్లకు అతి పెద్ద షాక్.. 82 ఏళ్ల పెన్షన్ దారుడు.. తన అకౌంట్ లో డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లాడు.. బ్యాంక్ అకౌంట్ లో 750 కోట్ల రూపాయలు ఉన్నాయి.. బ్యాంకు వాళ్లు వాళ్ల ముఖాలు వాళ్లు చూసుకోవటమే కాదు.. ఆ తాత ముఖాన్ని పదే పదే చూశారు.. 750 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్.. అంబానీ ఖాతాలో కూడా ఇంత డబ్బు ఉండదు కదా అని ఆశ్చర్యపోయాడు. ఇదే సమయంలో తాతతో వచ్చిన మనవడు బ్యాంక్ ఖాతా పరిశీలించారు.. మరో 750 కోట్లు.. మొత్తంగా ఈ తాత మనవడి ఖాతాలో 15 వందల కోట్ల రూపాయలు.. అందరూ షాక్.. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది.. పెన్షన్ తాత ఫ్యామిలీ ఖాతాలోకి 15 వందల కోట్లు ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి....

అసలేం జరిగిందంటే.. కామేశ్వర్ మిశ్రా అనే ఒక వృద్ధ కవి, తన ప్రతినెలా పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి కొడుకును తీసుకుని ఊరిలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC - మీసేవ లాంటి కేంద్రం) కి వెళ్లారు. ఆయన కొడుకు దివ్యాంగుడు కావడంతో అతనికి కూడా వికలాంగుల పింఛన్ వస్తుంది.

పింఛన్ డబ్బులు చేతికి అందుకున్నాక, కామేశ్వర్ మిశ్రా  సాధారణంగా తన అకౌంట్లో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో చూడమన్నారు. అకౌంట్ చెక్ చేస్తే స్క్రీన్ మీద నంబర్లు చూసిన కంప్యూటర్ ఆపరేటర్ షాకై గుండె జారినంత పనైంది.

ఆ అకౌంట్లో అక్షరాలా   రూ.759,69,51,951 (దాదాపు 759 కోట్ల రూపాయలు) ఉన్నాయి. ఆ వెంటనే కొడుకు అకౌంట్ కూడా చెక్ చేయగా.. అందులోనూ ఇంచుమించు అంతే భారీ మొత్తం కనిపించింది.

తాతగారి రియాక్షన్ 
అకౌంట్లో రూ. 1,500 కోట్లు కనిపించగానే సాధారణంగా ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ మిశ్రా గారు మాత్రం కంగారుపడ్డారు. "నా అకౌంట్లోకి ఇంత డబ్బు ఎలా వచ్చిందో నాకే తెలియదు. ఇది ఖచ్చితంగా బ్యాంకు వాళ్ల కంప్యూటర్ పొరపాటో లేదా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమో అయ్యుంటుంది. దయచేసి అధికారులు దీనిపై విచారణ జరిపి, ఆ తప్పును సరిదిద్దండి" అంటూ ఆయనే స్వయంగా బ్యాంకును, అధికారులను కోరారు.

బ్యాంక్ అధికారులు ఏమన్నారంటే ?
ఈ విషయం చుట్టుపక్కల తెగ వైరల్ కావడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది పూర్తిగా బ్యాంకింగ్ సిస్టమ్‌లో జరిగిన సాంకేతిక లోపం (టెక్నికల్ గ్లిచ్) వల్లే జరిగి ఉంటుందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బ్యాంకు అధికారుల వివరణ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.