SIR ఎమ్యురేషన్ ఫాం నింపడంలో గందరగోళం, ఓటర్లు ఆందోళన చెందుతున్న క్రమంలో కర్ణాటక ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. 2002 ఓటర్ లిస్టులో తమ పేరు, తమ తల్లిదండ్రులవివరాలు లేకున్నా.. అందుబాటులో ఉన్న వివరాలతో SIR ఫారం నింపి బీఎల్ వోలకు సమర్పించవచ్చని తెలిపింది. ఓటర్ సంతకం చేసిన SIR ఫారం సమర్పించడమే అత్యంత కీలకం అని తెలిపారు. ఏవైనా తేడాలు గమనిస్తే ధృవీకరణ కోసం ముసాయిదా లిస్టు ఓపెన్ గా ఉంటుందని తెలిపింది.
2002 ఎన్నికల ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లను, ఆ తర్వాత ఓటుకు అర్హత పొందిన వారి కుటుంబ సభ్యులతో అనుసంధానం చేస్తూ పోల్ ప్యానెల్ ఒక టేబుల్‌టాప్ ప్రక్రియ ద్వారా 90 శాతానికి పైగా ఓటర్ల మ్యాపింగ్ జరిగిందని ఇది ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
