దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. జులై 17న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని మూడో పాటను దర్శకుడు వీవీ వినాయక్ లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. చరణ్ అర్జున్ కంపోజ్ చేయడంతోపాటు ఈ పాటకు మీనింగ్‌ఫుల్ లిరిక్స్‌ను అందించాడు.
ధనుంజయ సీపాన పాడిన విధానం ఆకట్టుకుంది. ‘ఆడుకున్నదిక్కడే.. పాడుకున్నదిక్కడే.. అయిపోయిందా అప్పుడే..’ అంటూ సాగిన పాట కథలోని భావోద్వేగాలను ప్రతిబింబించేలా సాగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ ‘ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా రిలీజ్ చేసిన పాట కూడా ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేలా ఉంటుంది’ అని తెలియజేశారు.
