ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టం తేవాలి..దళితులపై బీజేపీ సర్కార్ కుట్ర : మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ రత్నాకర్

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టం తేవాలి..దళితులపై బీజేపీ సర్కార్ కుట్ర : మాల మహానాడు నేషనల్  ప్రెసిడెంట్ రత్నాకర్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేయాలని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాలమహానాడు అండ్ రాక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్స్ రత్నాకర్​ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా  రాజకీయ కుట్ర పన్నుతోందని విమర్శించారు. సమన్యాయం, సామాజిక న్యాయం పేరుతో  దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 కులాలకు ఎలా పంచుతారని ఆయన ప్రశ్నించారు. 

ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేసేంతవరకు నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తున్నాయని ఫైర్​అయ్యారు. ఎస్పీ వర్గీకరణపై మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. సమావేశంలో బొజ్జా శరత్, బి.సతీశ్ కుమార్,పి.కనకరాజు, నూకరాజు,కె.ప్రభాకర్, జె.యాదగిరి, ఎన్.శ్రీనివాస్, టి.శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.