గోదావరిఖని, వెలుగు: సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం, మెడికల్ బోర్డు సాధన కోసం జూలై 20 నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కార్మిక కార్మికుల కుటుంబసభ్యులతో కలిసి వంటావార్పు, -నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఆదివారం గోదావరిఖనిలోని హెచ్ఎంఎస్ఆఫీస్లో జరిగిన సమావేశంలో యూనియన్జనరల్ సెక్రటరీ రియాజ్‌అహ్మద్, డిప్యూటీ జనరల్సెక్రటరీ గోశిక అశోక్, ఎల్.వెంకటేశ్ మాట్లాడుతూ.. మెడికల్‌బోర్డు కొనసాగించాలని, మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌చేశారు.
టెన్త్ పాస్ కాలేదనే సాకుతో ఆపేసిన వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, సొంతింటి పథకం కింద హౌసింగ్‌బోర్డు సొసైటీని ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికుల పక్షాన నిలబడాల్సిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ లీడర్లు యాజమాన్యానికి, అధికార పార్టీకి బ్రోకర్లుగా మారారని, ప్రధాన సమస్యలను పక్కనపెట్టి 40 డిమాండ్లతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. మీటింగ్‌లో లీడర్లు కిరణ్, క్రాంతి కుమార్, సతీశ్, శ్రీకాంత్, ఎస్కే వలీ, చందర్ తదితరులు పాల్గొన్నారు.
