కరాటేలో సూర్యపేట విద్యార్థుల గిన్నీస్ రికార్డ్

కరాటేలో  సూర్యపేట విద్యార్థుల గిన్నీస్ రికార్డ్

సూర్యాపేట, వెలుగు: విజన్ మార్చల్ ఆర్ట్స్, జేఆర్ అకాడమీ ఆధ్వర్యంలో 10 రాష్ట్రాల నుంచి 1,500మంది కరాటే మాస్టర్లతో నిర్వహించిన కరాటే ప్రదర్శనలో సూర్యాపేటకు చెందిన 16మంది కరాటే విద్యార్థులు, మాస్టర్లు పాల్గొని గిన్నీస్ రికార్డు బుక్ లో స్థానం సాధించారు.

గిన్నీస్ బుక్ ఆప్ రికార్డ్సు వారు 16మందికి పంపించిన సర్టిఫికెట్స్, బెల్టులను ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు, మాస్టర్లకు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అందజేసి అభినందించారు.