గతేడాది ఇదే సమయంలో ఓ వైపు నీటి పరవళ్లు, మరో వైపు పర్యాటకుల రాకతో కళకళలాడిన జలపాతాలు.. ఇప్పుడు నీరులేక, టూరిస్ట్ లు రాక వెలవెలబోతున్నాయి. జులై రెండో వారం దాటినా వర్షాలు పడకపోవడంతో ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమాదర, గుండాల, మిట్టె జలపాతం, సమతులగుండం, కొండెంగ లొద్ది, దుద్దులాయి, దరిగాం బాహుబలి జలపాతాలతో పాటు నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతాల్లో చుక్క నీరు కనిపించడం లేదు. దీంతో పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.
-
