మహిళలు పౌల్ట్రీ రంగంలో రాణించాలి :బండారు దత్తాత్రేయ

మహిళలు పౌల్ట్రీ రంగంలో రాణించాలి :బండారు దత్తాత్రేయ

హైదరాబాద్, వెలుగు: పశుసంవర్థక, పౌల్ట్రీ రంగాల్లో పరిశోధనలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉండాలని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్‌‌లో జరిగిన 'వెట్‌‌ కన్వర్జెన్స్–2026' సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల స్కిల్స్‌‌ పెంచాలని,  పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, పరిశోధన ఫలితాలు రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పౌల్ట్రీ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.