హైదరాబాద్, వెలుగు: నీళ్లు ఇవ్వాలని అడిగితే రక్తం చల్లుతానంటూ సీఎం రేవంత్ దారుణమైన భాష మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా సరిపోలేదా? అని ఎక్స్‌లో ప్రశ్నించారు. ‘‘1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్లజూశారు.
1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించారు. మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచాయి. పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం.. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన పేర్కొన్నారు
