నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లోవస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'NBK111'. వీరసింహారెడ్డి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఫాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది.
బాలయ్యతో సంజయ్ దత్ ఢీ..
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ బాలయ్యకు ప్రతినాయకుడి పాత్రలో కనించబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ షూటాంగ్ షెడ్యూల్ లో అధికారికంగా పాల్గొన్నారని సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న కీలక షెడ్యూల్‌లో ఆయన బాలకృష్ణతో కలిసి పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. గోపీచంద్ మలినేని తన సినిమాల్లో మాస్ ఎలివేషన్లు, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అదే తరహాలో ఈ చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్...
ఇప్పటికే 'కేజీఎఫ్ 2' ,' లియో', 'డబుల్ ఇస్మార్ట్' వంటి చిత్రాల్లో విలన్ గా నటించి తనదైన ముద్ర వేసిన సంజయ్ దత్.. ఇప్పుడు బాలయ్యకు ఎదురెళ్లే శక్తివంతమైన పాత్రలో నటించనున్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య జరిగే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ లు.. సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ మూవీని బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ కథను దర్శకుడు సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
నయనతార అవుట్..
హీరోయిన్ విషయంలో కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదట నయనతారను కథానాయికగా ప్రకటించినప్పటికీ, డేట్స్ సమస్యలు, పారితోషికం తదితర కారణాలతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం ఆమె స్థానంలో మరో స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
భారీ తారాగణం, ఉన్నత సాంకేతిక విలువలు, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ 'NBK111' ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బాలయ్య-- గోపీచంద్ మలినేని కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉండగా, ఇప్పుడు సంజయ్ దత్ విలన్‌గా చేరడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. బాలీవుడ్, టాలీవుడ్ స్టార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో రికార్డులు ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Sanju baba at #NBK111 sets..
— RC (@RCCultX) July 12, 2026
Balayya x Sanjay Dutt 🔥🌋 pic.twitter.com/1st0VqXoCa
