B.Tech / B.Planning చదివారా? ఒక్క పరీక్షతోనే ప్రభుత్వ ఉద్యోగం

B.Tech / B.Planning చదివారా? ఒక్క  పరీక్షతోనే  ప్రభుత్వ ఉద్యోగం

తెలంగాణ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 15 నుంచి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

పోస్టు పేరు: టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్.
మొత్తం ఖాళీలు: 7. 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బి.ప్లానింగ్ / బి.టెక్ (ప్లానింగ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 15.
అప్లికేషన్ ఫీజు: ఓసీ, బీసీలకు రూ.1120, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ.620 చెల్లించాలి. 
లాస్ట్  డేట్: ఆగస్టు 22. 
ఎగ్జామినేషన్ తేదీ: 2026, అక్టోబర్.   
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ tgpsc.gov.inను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్ 
ఓఎంఆర్ ఆధారిత ఆఫ్‌లైన్ లేదా కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (సీబీఆర్​టీ) విధానంలో నిర్వహించే పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-–-Iలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు, పేపర్-–IIలో ప్లానింగ్ (డిగ్రీ లెవల్) నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు.