స్టైఫండ్ కోసం విద్యార్థుల ధర్నా.. చేవెళ్ల మున్సిపాలిటీపరిధిలోని కాలేజీ ఆసుపత్రి ఎదుట ధర్నా

స్టైఫండ్ కోసం విద్యార్థుల ధర్నా.. చేవెళ్ల మున్సిపాలిటీపరిధిలోని కాలేజీ ఆసుపత్రి ఎదుట ధర్నా

చేవెళ్ల, వెలుగు: తమకు రావాల్సిన స్టైఫండ్​ ఇవ్వడం లేదని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్​ కాలేజీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చేవెళ్ల మున్సిపాలిటీ​పరిధిలోని కాలేజీ, ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టైఫండ్​ ఇవ్వకపోవడంతో పాటు తాగునీరు, హాస్టల్  సౌలత్, ఇతర కనీస మౌలిక వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు. తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నా స్పందించకపోగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టైఫండ్  ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు  ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.